/rtv/media/media_files/2025/03/12/ALnaI7yYabiPUUlwCyXH.jpg)
DME AP Senior Resident Recruitment 2025 Apply Online for 1183 Posts
ఎప్పటి నుంచో మెడికల్ విభాగాల్లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. ఏపీలోని మెడికల్ కాలేజీ, హాస్పిటల్స్‌లో బ్రాడ్, సూపర్ స్పెషాలిటీల విభాగంలో ఖాళీల భర్తీకి రాష్ట్ర డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యూకేషన్ (DME) నోటిఫికేషన్ వదిలింది. ఈ నోటిఫికేషన్ ద్వారా దాదాపు 1,183 సీనియర్ రెసిడెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్ధులు మార్చి 22లోపు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి.
Also Read: రెచ్చిపోయిన పోలీసులు.. రచ్చ చేశారంటూ యువతకు గుండ్లు కొట్టించి ఊరేగింపు
అర్హతలు
ఎండీ/ఎంఎస్/ఎంసీహెచ్/ డీఎం/ఎండీఎస్ సంబంధిత స్పెషాలిటీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కలిగి ఉండాలి. అంతేకాకుండా AP మెడికల్ కౌన్సిల్/ AP డెంటల్ కౌన్సిల్‌లో రిజిస్టర్ అయి ఉండాలి.
Also Read: హైజాక్ నుంచి 104మందిని రక్షించిన పాక్ ఆర్మీ..16 మంది ఉగ్రవాదులు హతం
వయో పరిమితి
అభ్యర్థుల వయస్సు 2025 మార్చి 5 నాటికి 44 ఏళ్లకు మించి ఉండకూడదు.
జీతం
బ్రాడ్ స్పెషాలిటీ- రూ.80,500
సూపర్ స్పెషాలిటీ- రూ.97,750
పీఎం డెంటిస్ట్రీ- రూ. 74,750
అప్లికేషన్ ఫీజు
జనరల్ అభ్యర్థులు రూ.2వేలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.1,000 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
డాక్యుమెంట్స్
10 క్లాస్ సర్టిఫికేట్.
AP మెడికల్ కౌన్సిల్, డెంటల్ కౌన్సిల్‌లో పీజీ డిగ్రీతో రిజిస్ట్రేషన్ చేసుకున్న సర్టిఫికేట్.
ఎండీ/ఎంఎస్/ఎంసీహెచ్/ డీఎం/ఎండీఎస్ పోస్టు గ్రాడ్యూషన్ మార్కుల లిస్ట్. ఇది లేకపోతే అప్లికేషన్‌ను అంగీకరించారు.
MBBS, BDS, పోస్టు గ్రాడ్యూషన్ ఎండీ/ఎంఎస్/ఎంసీహెచ్/ డీఎం/ఎండీఎస్ డిగ్రీ ప్రొవిజినల్ సర్టిఫికేట్స్.
4th To 10th వరకు స్టడీ సర్టిఫికెట్లు
కుల ధ్రువీకరణ డాక్యుమెంట్.
ఆధార్ కార్డు.
ఎంపిక విధానం
పోస్టు గ్రాడ్యుషన్‌లో మార్కుల ఆధారంగా సెలెక్ట్ చేస్తారు. ఎంపికైన వారు సీనియర్ రెసిడెంట్స్ పోస్టులో సంవత్సరం పాటు వర్క్ చేస్తారు. ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.