/rtv/media/media_files/2025/10/14/tgpsc-group-2-2025-10-14-21-14-47.jpg)
TGPSC: గ్రూప్-2 ఉద్యోగ అభ్యర్థులకు టీజీపీఎస్సీ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు అక్టోబరు18న నియామకపత్రాలు అందించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు వచ్చే శనివారం సాయంత్రం శిల్పకళా వేదికలో సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ఉద్యోగ నియామక పత్రాలు అందించనున్నట్లు టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం తెలిపారు.
ఇది కూడా చూడండి: Amazon Offer: ఆఫరండీ బాబు.. రూ.6 వేలకే 5జీ స్మార్ట్‌ఫోన్.. దిమ్మతిరిగే ఫీచర్లు!
TGPSC Good News For Group-2 Job Candidates
ఈ మేరకు గ్రూప్ 2 ఉద్యోగాల నియామక పత్రాల పంపిణీ ఏర్పాట్లపై సీఎస్ రామకృష్ణరావు సమీక్ష నిర్వహించారు. గ్రూప్-2 నియామకాలకు 783 మంది ఎంపికయ్యారని, రెవెన్యూ, వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, పంచాయతీరాజ్, సాధారణ పరిపాలనతోపాటు మరో 16శాఖల్లో వీరిని ఉద్యోగాలకు సెలక్ట్ చేసినట్లు వెల్లడించారు. ఈ క్రమంలోనే అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.
ఇదిలా 2024 డిసెంబర్ 15, 16 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. మొత్తం 783 గ్రూప్-2 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను టీజీపీఎస్సీ విడుదల చేసింది.5.57 లక్షల మంది అభ్యర్థులు ఈ గ్రూప్-2 పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఇందులో దాదాపు సగం మంది అభ్యర్థులే పరీక్షకు హాజరయ్యారు. జనవరి 18న గ్రూప్-2 రాత పరీక్షల ప్రాథమిక కీని విడుదల చేశారు. ఒక్క పోస్టు భర్తీ పెండింగ్‌లో ఉండగా.. 782 పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల ప్రొవిజనల్ జాబితాను వెల్లడించింది. దసరాలోపే గ్రూప్ 2 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేయాలని ప్రభుత్వం భావించినప్పటికీ ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో వాయిదా పడింది. అక్టోబర్ 18న ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజేయనుంది.