Amazon Offer: ఆఫరండీ బాబు.. రూ.6 వేలకే 5జీ స్మార్ట్‌ఫోన్.. దిమ్మతిరిగే ఫీచర్లు!

లావా కంపెనీ Lava Bold N1 5G స్మార్ట్ ఫోన్‌ ఈ దీపావళి అమెజాన్ ఆఫర్‌లో వస్తుంది. ఈ ఫోన్ ధర ఆఫర్‌లో మీకు రూ.6,999లకు లభిస్తుంది. అదే మీరు అమెజాన్ సేల్ నుంచి HDFC బ్యాంక్ డెబిట్, డెబిట్ కార్డ్ EMI ఆప్షన్ తో తీసుకుంటే రూ.6,300లకు లభిస్తుంది.

New Update
Lava Bold N1 5G

Lava Bold N1 5G

దీపావళి పండుగ సందర్భంగా అమెజాన్ ఫెస్టివల్ ఆఫర్‌ కింద స్మార్ట్‌ఫోన్‌పై బెస్ట్ డీల్స్‌ను అందిస్తోంది. తక్కువ బడ్జెట్‌లో 5జీ స్మార్ట్‌ఫోన్ తీసుకోవాలని అనుకునే వారి కోసం ఈ మొబైల్ అని చెప్పవచ్చు. అయితే ఈ ఆఫర్లు కొన్ని రోజులు మాత్రమే. ప్రస్తుతం అమెజాన్‌లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ దివాళి స్పెషల్ సేల్ నడుస్తోంది. ఈ సేల్ పూర్తి అయ్యేలోగా ఈ మొబైల్ కొనుక్కోవచ్చు. అయితే ఈ ఆఫర్‌లో మీరు 4K కెమెరా ఉన్న 5G స్మార్ట్ ఫోన్‌ను కేవలం రూ.6 వేలకే కొనుగోలు చేయవచ్చు. మరి అదిరిపోయే ఈ ఫీచర్లతో ఉన్న ఆ 5జీ స్మార్ట్‌ఫోన్ ఏంటో ఈ స్టోరీలో చూద్దాం. 

ఇది కూడా చూడండి: Flipkart Diwali Offer: కేవలం రూ. 35 వేలకే ఐఫోన్ 16.. ఈ దీపావళికి ఇంతకు మించిన ఆఫర్ లేదు బ్రో!

డ్యూయల్ రియర్ కెమెరా..

లావా కంపెనీ Lava Bold N1 5G స్మార్ట్ ఫోన్‌ ఈ దీపావళి అమెజాన్ ఆఫర్‌లో వస్తుంది. ఈ ఫోన్ ధర ఆఫర్‌లో మీకు రూ.6,999లకు లభిస్తుంది. అదే మీరు అమెజాన్ సేల్ నుంచి HDFC బ్యాంక్ డెబిట్, డెబిట్ కార్డ్ EMI ఆప్షన్ తో తీసుకుంటే మీకు రూ.699 ఎక్స్‌ట్రా డిస్కౌంట్ కూడా లభిస్తుంది. దీంతో మీకు అన్ని ఆఫర్లు పోయి రూ.6,300లకు లభిస్తుంది. ఈ లావా బోల్డ్ ఎన్1 స్మార్ట్ ఫోన్‌కు 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ ఉంది. అలాగే దీనికి డ్యూయల్ రియర్ కెమెరా కూడా ఉంది. ఈ మొబైల్‌కి 13MP మెయిన్ కెమెరా, ముందు 5MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. దీనికి 5జీ చిప్ సెట్ కూడా ఉంది. 

ఇది కూడా చూడండి: Flipkart Diwali Offer: దీపావళికి బెస్ట్ డీల్స్.. 7550mAh​ బ్యాటరీ.. 50MP కెమెరాతో కళ్లు చెదిరే ఫీచర్లతో మొబైల్స్!

ఇందులో 4 జీబీ ఫిజికల్ ర్యామ్‌తో పాటు 4జీబీ వర్చువల్ ర్యామ్ కూడా ఉంది. దీనికి 64 జీబీ ఇంట్నర్నల్ స్టోరేజ్ కూడా ఉంది. ఈ లావా బడ్జెట్ 5జి స్మార్ట్ ఫోన్ HD+ రిజల్యూషన్ కలిగిన 6.75 ఇంచ్ స్క్రీన్ ఉంది. ఈ స్క్రీన్ 90Hz రిఫ్రెష్ రేట్, మంచి బ్రైట్నెస్ కూడా ఉంది. ఈ ఫోన్ 5000 mAh బిగ్ బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా దీనికి ఉంది. ఈ ఫోన్ IP54 రేటింగ్ తో డస్ట్ అండ్ వాటర్ స్ప్లాష్ రెసిస్టెన్స్ ఉండటం వల్ల బాగా పనిచేస్తుంది. ఈ లావా స్మార్ట్ ఫోన్ ఫేస్ అన్లాక్, సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ బ్లూ, గోల్డ్ రెండు కలర్‌లో ఈ మొబైల్ ఉంది. 

Advertisment
తాజా కథనాలు