BIG BREAKING: వైసీపీకి దెబ్బ మీద దెబ్బ.. విశాఖ, గుంటూరు మేయర్ తో పాటు కుప్పం మున్సిపాలిటీలపై TDP జెండా!

ఏపీలో కూటమి మరో సారి సత్తా చాటింది. విశాఖ, గుంటూరు మేయర్ తో పాటు కుప్పం మున్సిపాలిటీ చైర్మన్ పదవులు దక్కించుకుంది. గతంలో ఈ స్థానాలను వైసీపీ కైవసం చేసుకోగా.. అవిశ్వాస తీర్మానాలతో ఆ పార్టీ అభ్యర్థులు పదవులు కోల్పోయారు.

New Update
Chandrababu Vs Jagan

Chandrababu Vs Jagan

విశాఖ, గుంటూరు కార్పొరేషన్లతో పాటు.. కుప్పం మున్సిపాలిటీపై టీడీపీ జెండా ఎగుర వేసింది. విశాఖ, గుంటూరు కార్పొరేషన్ల మేయర్ ఎన్నికను నేడు అధికారులు నిర్వహించారు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా కూటమి నుంచి బరిలోకి దిగిన టీడీపీ నేత పీలా శ్రీనివాసరావు ఎన్నికయ్యారు. వైసీపీ నుంచి గతంలో గొలగాని హరి వెంకట కుమారి మేయర్ గా ఉండగా.. ఆమెపై ఇటీవల అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. అవిశ్వాస తీర్మానానికి మూడింట రెండు వంతుల సభ్యులు మద్దతు తెలపడంతో వెంకట కుమారి పదవి కోల్పోయారు. దీంతో ఈరోజు నూతన మేయర్ ఎన్నికను అధికారులు నిర్వహించగా కూటమి నుంచి పీలా శ్రీనివాసరావు ఎన్నికయ్యారు. దీంతో విశాఖలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు సంబరాలు జరుపుకుంటున్నారు.

గుంటూరు మేయర్ గా రవీంద్ర..

గుంటూరులోనూ మేయర్ పీఠం కూటమికే దక్కింది. మేయర్ బరిలో టీడీపీ అభ్యర్థిగా కోవెలమూడి రవీంద్ర, వైసీపీ నుంచి అచ్చాల వెంకటరెడ్డి నిలిచారు. రవీంద్రకు 34 మంది కార్పొరేటర్లు ఓటు వేయగా.. వైసీపీ అభ్యర్థికి 27 మంది మద్దతు లభించింది. దీంతో రవీంద్ర ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు.

కుప్పం మున్సిపల్ చైర్మన్ గా సెల్వరాజ్ ఎన్నికయ్యారు. మొత్తం 24 మంది సభ్యులకు గానూ.. 14మంది కౌన్సిలర్లు టీడీపీ వైపు నిలిచారు. వీరితో పాటు ఎక్స్ ఆఫిషియో మెంబర్ కూడా మద్దతు ప్రకటించడంతో టీడీపీ అభ్యర్థి సెల్వరాజ్ మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికయ్యారు. 

(telugu-news | latest-telugu-news | guntur | kuppam)

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు