KCR: గులాబీ బాస్‌ సభలో బన్నీ పోస్టర్‌..!

బీఆర్‌ఎస్‌ పార్టీ ఏర్పాటు చేసి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కేసీఆర్‌ వరంగల్‌ లో భారీ సభ ఏర్పాటు చేశారు. ఈ సభా ప్రాంగణం వద్ద బన్నీ పోస్టర్‌ ఒకటి వైరల్‌ గా మారింది. దాని మీద అల్లు అర్జున్‌ డైలాగ్‌ కూడా ఉంది.

New Update
bunny

bunny

తెలంగాణలో బీఆర్‌ఎస్‌ పార్టీ ఏర్పాటు చేసి 25 సంవత్సరాలు పూర్తి అయిన క్రమంలో వరంగల్‌ లో కేసీఆర్‌ భారీ బహిరంగా సభ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ భారీ సభకు సుమారు 6 లక్షల మంది సభకు హాజరైనట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఈ భారీ బహిరంగ సభలో ఓ ఆసక్తికర సన్నివేశం జరిగింది.

అది ఏంటంటే... కేసీఆర్ సభలో అల్లు అర్జున్‌ ఫ్లెక్సీ ఒకటి సంచలనంగా మారింది. పుష్ప 2 సినిమాలోని బన్నీ ఫొటోను పెట్టారు. అక్కడితో ఆగకుండా బన్నీ డైలాగ్‌ ని ఒక్కదాన్ని..తగ్గేదేలే..కేసీఆర్‌ అంటే పేరు కాదు..కేసీఆర్‌ అంటే బ్రాండ్‌..అంటూ అల్లు అర్జున్‌ చెప్పే డైలాగ్‌ ని ఆ ఫ్లెక్సీ మీద రాశారు.

అల్లు అర్జున్‌ అభిమానులు ఈ పోస్టర్ ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.ఈ ఫ్లెక్సీ ప్రస్తుతం సోషల్‌  మీడియాలో వైరల్‌ అవుతుంది. దీనిని బన్నీ ఫ్యాన్స్‌ వైరల్‌ చేస్తున్నారు.

 warangal | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates 

Advertisment
తాజా కథనాలు