/rtv/media/media_files/2025/05/17/HxchvmOO68yrsZmCg2mb.jpg)
Teenage Girl
ఒడిశాలో దారుణం జరిగింది. 10 ఏళ్ల క్రితం మూడేళ్ల వయసున్న ఓ బాలిక రోడ్డు పక్కన దొరికితే ఆ పాపను లాలించి, పెద్దది చేసిన తల్లిని చివరికి ఆ అమ్మాయే కడతేర్చింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, 13 ఏళ్ల బాలిక ప్రస్తుతం 8వ తరగతి చదువుతుంది. అయితే ఆ బాలిక ఇద్దరు యువకులతో రిలేషన్షిప్ ఉంది. ఇది తెలిసి మందలించిన తల్లి రాజలక్ష్మిని ఇద్దరు ప్రియుళ్లతో కలిసి చంపేసింది. ఆమె ఇన్ స్టాగ్రామ్ చాటింగ్ తో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
ఏప్రిల్ 29న గజపతి జిల్లాలోని పర్లాఖేముండి పట్టణంలోని అద్దె ఇంట్లో తన పెంపుడు తల్లి రాజలక్ష్మి కర్ (54)ను హత్య చేయడానికి బాలిక కుట్ర పన్నింది. రాజలక్ష్మికి ముందుగా నిద్రమాత్రలు ఇచ్చి, ఆ తరువాత దిండులతో ఆమెను ఊపిరాడకుండా చేసింది. అనంతరం తల్లికి గుండెపోటు వచ్చిందిని అందర్ని నమ్మి్ంచింది. వెంటనే రాజలక్ష్మి కర్ ను ఆసుపత్రికి తరలించగా చనిపోయినట్లుగా డాక్టర్లు తెలిపారు. మరుసటి రోజు ఆమె మృతదేహాన్ని భువనేశ్వర్‌లో ఆమె బంధువుల సమక్షంలో దహనం చేశారు.
Also Read : బికినీ అందాలతో రెచ్చిపోయిన ఖుషీ కపూర్.. వెకేషన్ అతడు కూడా!
A 13 year old girl wanted to be in relationship with two men. Definitely she must be a product of a prostitute.
— Polar (@xotomatic) May 17, 2025
Woman who adopted 3-day-old girl killed by same child 13 years later in Odishahttps://t.co/WZrhsu0QNJ
-via inshorts pic.twitter.com/DKvFqSmafv
Also Read : పాకిస్థాన్‌ను ఉగ్రవాద దేశంగా ప్రకటించాలి.. ఎంపీ డిమాండ్
మొబైల్ ఫోన్‌ను చెక్ చేయగా
అయితే రాజలక్ష్మి సోదరుడు శిబా ప్రసాద్ మిశ్రా బాలిక మొబైల్ ఫోన్‌ను చెక్ చేయగా అందులోని ఇన్ స్టాగ్రామ్ చాటింగ్ ద్వారా షాకింగ్ విషయం తెలిసింది. ఆ చాట్‌లలో రాజలక్ష్మిని చంపే ప్లాన్ నుంచి ఆమె బంగారు ఆభరణాలు, నగదును స్వాధీనం చేసుకునే వరకు ఆ బాలిక తన ఇద్దరు లవర్లతో చేసిన సంబాషణ మొత్తం ఉంది. మిశ్రా మే 14న పర్లాకిమిడి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని టీనేజ్ అమ్మాయితో పాటుగా ఆలయ పూజారి గణేష్ రథ్ (21), అతని స్నేహితుడు దినేష్ సాహు (20) లను అరెస్టు చేశారు.
Also Read : వర్షిణి కావాలి.. జైలులో పూజలు చేస్తున్న అఘోరీ!
ఎస్పీ జతీంద్ర కుమార్ పాండా ప్రకారం, రాజలక్ష్మి, ఆమె భర్త దాదాపు 14 సంవత్సరాల క్రితం భువనేశ్వర్‌లోని రోడ్డు పక్కన పసికందును చూశారు. పిల్లలు లేని ఆ దంపతులు ఆ బిడ్డను తమ సొంత బిడ్డలా పెంచుకున్నారు. రాజలక్ష్మి భర్త ఏడాది కింద మరణించాడు. అప్పటి నుండి ఆమె ఆ అమ్మాయిని ఆమే అన్ని తానై పెంచింది. కాలక్రమేణా, ఆ అమ్మాయి తనకంటే చాలా పెద్దవాళ్ళైన రత్, సాహులతో లవ్ ఎఫైర్ నడిపించి పెంచిన అమ్మనే కడతేర్చింది. నేరానికి ఉపయోగించిన మూడు మొబైల్ ఫోన్లు, రెండు దిండ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Also Read : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 35 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్!
daughter | mother | telugu-news | crime