/rtv/media/media_files/2025/05/27/676ImP0hJlcjiYP5bi1y.jpg)
AP High Court Recruitment 2025
ఏపీలో నిరుద్యోగులకు శుభవార అందింది. ఇప్పటికే 16,347 పోస్టులతో ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ 2025 రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మరోక భారీ నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్రంలోని జిల్లా కోర్టుల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకై ఏపీ సర్కార్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దీని ద్వారా మొత్తం 1620 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ మే 13 నుంచి ప్రారంభమైంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
Also Read: మరో యువతితో లాలూ కొడుకు రాసలీలలు.. జీవితం నాశనం చేశారంటూ తేజ్ భార్య ఆరోపణలు!
మొత్తం ఖాళీలు : 1620
జూనియర్ అసిస్టెంట్ - 230 పోస్టులు, ఆఫీస్ సబార్డినేట్ - 651 పోస్టులు, ప్రాసెస్ సర్వర్ - 164 పోస్టులు, రికార్డ్ అసిస్టెంట్ - 24 పోస్టులు, కాపీయిస్ట్ - 193 పోస్టులు, ఎగ్జామినర్ - 32 పోస్టులు, ఫీల్డ్ అసిస్టెంట్ 56 పోస్టులు, టైపిస్ట్ - 162 పోస్టులు, స్టెనోగ్రాఫర్ - 80 పోస్టులు, డ్రైవర్ - 28 పోస్టులు ఉన్నాయి. వీటిని జిల్లాలవారీగా భర్తీ చేయనున్నారు. AP HIGH COURT అఫీషియల్ వెబ్‌సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. మే 13 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అయింది. జూన్ 2వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. OBC, EWS కేటగిరీ అభ్యర్థులు రూ.800, SC, ST, దివ్యాంగ అభ్యర్థులు రూ.400 దరఖాస్తు ఫీజు చెల్లించాలి.
Also Read: వారెవ్వా అదిరిపోయింది.. iQOO నుంచి కిర్రాక్ స్మార్ట్‌ఫోన్ - ఫీచర్లు హైక్లాస్!
సబార్డినేట్ పోస్టులకు 7వ తరగతి విద్యార్హత ఉంటే సరిపోతుంది. అదే జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు డిగ్రీ విద్యార్హతగా ఉండాలి. అలాగే టైపిసట్, కాపీయిస్ట్, రికార్డ్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ పోస్టులకు ఇంటర్, డిగ్రీ విద్యార్హతతో పాటు సంబంధిత విభాగంలో ఉత్తీర్ణత కలిగి ఉండాలి. కాగా టైపింగ్, కంప్యూటర్ అనుభవం తప్పనిసరిగా ఉండాలి. 42 ఏళ్లలోపు ఉన్న వారు అర్హులు. రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.
Also Read: అనిరుధ్‌కు కాస్ట్‌లీ గిఫ్ట్ ఇచ్చిన విజయ్ దేవరకొండ.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
ఈ లింక్ క్లిక్ చేసి అప్లై చేసుకోండి - అప్లికేషన్ లింక్
Also Read: కరోనా పని ఖతం.. నో టెన్షన్.. గుడ్ న్యూస్ చెప్పిన నిపుణులు!