Big Breaking: ఏపీలో ఎస్ఐ నియామకాలపై హైకోర్టు స్టే
ఏపీలో ఎస్ఐ నియామక ప్రక్రియపై హైకోర్టు స్టే విధించింది. నియామకాల సందర్భంగా తమకు అన్యాయం జరిగిందని పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో విచారణ జరిపిణ న్యాయస్థానం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
ఏపీలో ఎస్ఐ నియామక ప్రక్రియపై హైకోర్టు స్టే విధించింది. నియామకాల సందర్భంగా తమకు అన్యాయం జరిగిందని పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో విచారణ జరిపిణ న్యాయస్థానం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
ఏపీ నిరుద్యోగులకు శుభవార్త. ఈ నెలాఖరులోపు గ్రూప్- 1లో 100, గ్రూప్ 2లో 900 పోస్టులు భర్తీ చేస్తామని ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ తెలిపారు.
ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది జగన్ సర్కార్. గ్రూపు-2లో అదనంగా 212 పోస్టులను పెంచుతూ సర్కార్ జీవోను విడుదల చేసింది. గతంలో గ్రూప్ -2లో 508పోస్టుల భర్తీకి సర్కార్ జీవో జారీ చేసిన సంగతి తెలిసిందే. పోస్టుల సంఖ్య పెంచాలని అభ్యర్థులు విజ్ఞప్తి చేయడంతో సీఎం జగన్ సానుకూలంగా స్పందించారు. పరిశీలన అనంతరం 212 పోస్టుల పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇటీవల హైదరాబాద్ లో జరిగిన ప్రవళిక ఆత్మహత్య ఘటన వ్యవహారంలో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. ప్రేమ వ్యవహారం కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకుందని పోలీసులు చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా ఆమె గ్రూప్-1, 2, 3, 4 తో పాటు DAOకు దరఖాస్తు చేసుకుందని.. అందుకు సంబంధించిన పత్రాలను సోషల్ మీడియాలో వివిధ పార్టీల నాయకులు, నిరుద్యోగులు షేర్ చేస్తున్నారు.
ఏపీలో ఎస్ఐ నియామకాలకు సంబంధించి దాఖలైన పిటిషన్ పై హైకోర్టులో ఈ రోజు విచారణ జరిగింది. ప్రభుత్వం నిబంధనలు పాటించని కారణంగా అనేక మంది అభ్యర్థులు అర్హత కోల్పోయారని పిటిషనర్ కోర్టుకు విన్నవించారు. ఈ నెల 14, 15 తేదీల్లో జరిగే పరీక్షలను తత్కాలికంగా వాయిదా వేయాలని కోరారు. అయితే.. ఈ పిటిషన్ పై తీర్పును రిజర్వ్ చేసింది న్యాయస్థానం. దీంతో కోర్టు తీర్పు ఎలా ఉంటుందనే అంశంపై అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది.
ఏపీలో త్వరలో టెట్, డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. ముందు టెట్, ఆ తర్వాత డీఎస్సీ ఉంటుందని ఆయన తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను త్వరలో వెల్లడిస్తామన్నారు బొత్స.
ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు మంత్రి బొత్స సత్యనారాయణ. త్వరలోనే 8వేలకు పైగా టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. పూర్తి వివరాలు వివరాలు చూద్దాం.