Israel -Hamas War: ఇజ్రాయెల్‌పై దాడులు.. రంగంలోకి ఇరాన్‌ !

టెల్‌ అవీవ్‌పై హమాస్‌ రాకెట్లతో దాడి చేసిన అనంతరం ఇజ్రాయెల్ రక్షణశాఖ మంత్రి సైన్యాన్ని అప్రమత్తం చేశారు. మూడు నెలల తర్వాత హమాస్ దాడి చేయడంతో ఇరాన్‌ రంగంలోకి దిగే సూచనలు కనిపిస్తున్నాయని వార్తలు వస్తున్నాయి

New Update
Israel -Hamas War: ఇజ్రాయెల్‌పై దాడులు.. రంగంలోకి ఇరాన్‌ !

ఇజ్రాయెల్‌లో టెన్షన్ వాతావరణం నెలకొంది. టెల్‌ అవీవ్‌పై హమాస్‌ రాకెట్లతో దాడి చేసిన అనంతరం ఇజ్రాయెల్ రక్షణశాఖ మంత్రి సైన్యాన్ని అప్రమత్తం చేశారు. మూడు నెలల తర్వాత టెల్ అవీవ్‌పై హమాస్ తొలి దాడి చేయడంతో.. ఇరాన్‌ రంగంలోకి దిగేందుకు ఇది సూచన అంటూ వార్తలు వస్తున్నాయి. మరోవైపు గురువారం ఈజిప్ట్‌ రాజధాని కైరో శాంతి చర్చలు జరగనున్నాయి. ఒకవేళ చర్చలు విఫలం అయితే ఇరాన్‌ యుద్ధంలోకి దిగుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Also Read: థాయ్‌లాండ్‌లో కీలక పరిణామం.. ప్రధానిపై వేటు

ఇప్పటికే ఇరాన్‌ మిలటరీ డ్రిల్‌ను మొదలుపెట్టింది. పశ్చిమాసియా సముద్ర జలాల్లోకి కూడా అమెరికాకి చెందిన అత్యాధునిక యుద్ధనౌక వెళ్లింది. ఇజ్రాయెల్ ఓ వైపు ఇరాన్‌తో శాంతి చర్చలు అంటూనే గాజాలో దాడులను తీవ్రతరం చేసింది. రఫా ఆక్రమణ తర్వాత అక్కడ ఉంటున్న పౌరులను మానవతాసాయం ఆగిపోయింది. శిబిరాల్లో కనీసం మంచినీళ్లు కూడా దొరకక తీవ్ర కరువు నెలకొంది. ఓవైపు యుద్ధం, మరోవైపు రోగాలతో జనాలు మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది.

ఇదిలాఉండగా ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌లో హమాస్ అగ్రనేత ఇస్మాయిల్ హనియా హత్య అనంతరం పశ్చిమాసియాలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. రానున్న రోజుల్లో ఇరాన్ లేదా దానికి మద్దతిస్తున్న సంస్థలు ఇజ్రాయెల్‌పై దాడిచేసే అవకాశం ఉందని ఇప్పటికే అమెరికా హెచ్చరించింది. ఈ వారంలోనే దాడులు జరగొచ్చని పేర్కొంది. మరోవైపు ఇరాన్‌ ప్రతీకార దాడుల్ని సమర్థవంతగా అడ్డుకునేందుకు ఇజ్రాయెల్ సైతం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read: తరుముకొస్తున్న మంకీపాక్స్.. ఆఫ్రికాలో హెల్త్ ఎమర్జెన్సీ!

Advertisment
Advertisment
తాజా కథనాలు