Srettha Thavison: థాయ్‌లాండ్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. నైతిక ఉల్లంఘనలకు పాల్పడ్డారనే అభియోగాలపై ఆ దేశ ప్రధాని (Thailand Prime Minister) స్రెత్తా థావిసిన్‌పై వేటు పడింది. అక్కడి రాజ్యాంగ న్యాయస్థానం ఆయన్ని పదవిలో నుంచి తొలగించింది. ఓ కోర్టు అధికారికి లంచం ఇచ్చేందుకు యత్నించిన కేసులో జైలు శిక్ష అనుభవించిన క్యాబినేట్ సభ్యుడి నియామకానికి సంబంధించిన వ్యవహారంలో కోర్టు ఆయనను పదవి నుంచి తీసేసింది. అంతేకాదు ఈ ఆదేశాలు వెంటనే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. అయితే విపక్ష పార్టీని రద్దు చేయాలని ఇటీవలే ఆ కోర్టు ఆదేశించింది. ఇలా జరిగిన కొన్ని రోజులకే థాయ్‌లాండ్ ప్రధానిపై వేటు పడటం గమనార్హం.
పూర్తిగా చదవండి..Thailand: థాయ్‌లాండ్‌లో కీలక పరిణామం.. ప్రధానిపై వేటు
థాయ్‌లాండ్ ప్రధానమంత్రి స్రెత్తా థావిసిన్ పై వేటు పడింది. నేరారోపణ ఉన్న ఓ న్యాయవాదిని తన మంత్రివర్గంలో నియమించుకుని నైతిక ఉల్లంఘనలకు పాల్పడ్డారనే అభియోగాలపై ఆయనను కోర్టు పదవి నుంచి తొలగించింది.
Translate this News: