Monkeypox : ఆఫ్రికా (Africa) లో రోజురోజుకి మంకీపాక్స్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో ఆఫ్రికన్ యూనియన్ హెల్త్ వాచ్డాగ్ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ఈ వ్యాప్తి అనేక ఆఫ్రికన్ దేశాలలో , ముఖ్యంగా డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో అతిగా వ్యాపిస్తుంది. మంకీపాక్స్ ను కాంటినెంటల్ సెక్యూరిటీ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా (Health Emergency) ప్రకటిస్తున్నాము” అని ఆఫ్రికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అధిపతి జీన్ కసేయా చెప్పారు.కరోనా కంటే మంకీ పాక్స్ డేంజర్ అని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.
పూర్తిగా చదవండి..Africa : తరుముకొస్తున్న మంకీపాక్స్.. ఆఫ్రికాలో హెల్త్ ఎమర్జెన్సీ!
ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎంపాక్స్ మహమ్మారిని తాజాగా గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. రిపబ్లిక్ ఆఫ్ కాంగో నుంచి పొరుగు దేశాలకు ఈ వ్యాధి విస్తరిస్తుండటంతో WHO ఈ నిర్ణయం తీసుకుంది. దీన్ని అరికట్టడానికి ఇప్పటికే చర్యలు చేపట్టింది.
Translate this News: