ఆసియా కప్ ఫైనల్స్ తరువాత అవార్డుల సెర్మనీని భారత ఆటగాళ్ళు ఫుల్ గా ఎంజాయ్ చేశారు. ఆ సందర్భంలో అవార్డుల ప్రెజంటేషన్ సమయంలో భారత ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, ఇషాన్ కిషన్ మధ్య జరిగిన సరదా సంఘటనలు అభిమానులను మరింత ఖుషీ చేశాయి. విరాట్, ఇషాన్ ఒకరిని ఒకరు ఇమిటేట్ చేసుకుంటూ అందరి చేత నవ్వించారు. మొదట విరాట్ కోహ్లీ ఎలా నడుస్తాడో ఇషాన్ కిషన్ చూపించాడు. అచ్చం కోహ్లీలా నడుస్తూ అందరినీ ఆకట్టుకున్నాడు.
పూర్తిగా చదవండి..విరాట్ ను ఇమిటేట్ చేసిన ఇషాన్ కిషన్…ఆసియా కప్ ఫన్నీ మూమెంట్స్
ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంకను చిత్తు చేసిన టీమ్ఇండియా సంబరాలు చేసుకుంది. లంకపై 10 వికెట్ల తేడాతో విజయం అందుకున్న భారత్, 8వ సారి ఆసియా కప్ టైటిల్ గెలిచింది. ఈ మూమెంట్ లో భారత ఆటగాళ్ళు సరదాగా గడిపారు. ఒకరిని ఒకరు ఆట పట్టించుకుంటూ ఎంజాయ్ చేశారు.
Translate this News: