Rajasthan Elections : ఈ ఏడాది చివరిలో రాజస్థాన్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ (BJP), కాంగ్రెస్ (Congress) వ్యూహాలు ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. దేశంలో మరోసారి అధికారంలోకి వచ్చేందుకు ఎన్డీఏ (NDA) ప్లాన్ చేస్తుంటే…అధికార కాంగ్రెస్ మరోసారి గెలిచేందుకు వ్యూహాన్ని రచిస్తోంది. ఇందులో భాగంగానే ఇరు పార్టీలు కూడా పార్టీలో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నాయి. రాజస్థాన్ లో ఈసారి గుజరాత్ మోడల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ ప్లాన్ చేస్తుంటే…అటు బీజేపీ మాత్రం 40 నుంచి 45 మంది ఎమ్మెల్యేలకు టిక్కెట్లు నిరాకరించింది. ఇటు కాంగ్రెస్ సైతం అదే స్ట్రాటజీతో ముందుకు సాగుతుంది. 50కి పైగా స్థానాల్లో కొత్త ముఖాలకు అవకాశం కల్పించాలనే వ్యూహంలో భాగంగా పార్టీ రెండు అంచెల సర్వే నిర్వహించింది. ఒక సర్వేను ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ (Ashok Gehlot) చేయగా, మరొకటి పార్టీ హైకమాండ్ నిర్వహించింది. కార్యకర్తల అభిప్రాయాలను తీసుకునేందుకు ప్రతి లోక్సభ నియోజకవర్గానికి పంపిన చాలా మంది పరిశీలకులు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్లు తగ్గించాలని సూచించినట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
పూర్తిగా చదవండి..Rajasthan Elections: సగం పైగా స్థానాల్లో కొత్త వాళ్లు, బీజేపీ, కాంగ్రెస్ లది అదే స్ట్రాటజీ
రాజస్థాన్ లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ తరుణంలో దేశంలో మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు ఎన్డీఏ ప్లాన్ చేస్తోంది. అందులో భాగంగానే రాజస్థాన్ లో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు వ్యూహాలను రచిస్తోంది. ఈ ఏడాది చివరిలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం కసరత్తు మొదలు పెట్టింది. దాదాపు 45మంది నాయకులకు టిక్కెట్ నిరాకరించింది. పార్టీలో కొత్త జోష్ నింపడంతోపాటు కార్యకర్తలను ఉత్సాహపరిచేందుకు బీజేపీ, కాంగ్రెస్ రెండూ పార్టీలు కూడా కొత్త ముఖాలను పోటీకి దింపుతున్నాయి. బీజేపీ 45 మంది పాత ముఖాలను పక్కనపెడితే...కాంగ్రెస్ 50 మంది కొత్త ముఖాలకు ఛాన్స్ ఇచ్చింది. ఈ విషయంలో బీజేపీ, కాంగ్రెస్ ఒకే స్ట్రాటజీ కనబరుస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Translate this News: