Rajasthan Elections: సగం పైగా స్థానాల్లో కొత్త వాళ్లు, బీజేపీ, కాంగ్రెస్ లది అదే స్ట్రాటజీ
రాజస్థాన్ లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ తరుణంలో దేశంలో మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు ఎన్డీఏ ప్లాన్ చేస్తోంది. అందులో భాగంగానే రాజస్థాన్ లో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు వ్యూహాలను రచిస్తోంది. ఈ ఏడాది చివరిలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం కసరత్తు మొదలు పెట్టింది. దాదాపు 45మంది నాయకులకు టిక్కెట్ నిరాకరించింది. పార్టీలో కొత్త జోష్ నింపడంతోపాటు కార్యకర్తలను ఉత్సాహపరిచేందుకు బీజేపీ, కాంగ్రెస్ రెండూ పార్టీలు కూడా కొత్త ముఖాలను పోటీకి దింపుతున్నాయి. బీజేపీ 45 మంది పాత ముఖాలను పక్కనపెడితే...కాంగ్రెస్ 50 మంది కొత్త ముఖాలకు ఛాన్స్ ఇచ్చింది. ఈ విషయంలో బీజేపీ, కాంగ్రెస్ ఒకే స్ట్రాటజీ కనబరుస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.