Apple Event 2023 - iPhone 15 launch: ప్రతీ ఏడాది ఓ కొత్త సీరీస్ ను లాంఛ్ చేస్తుంది ఆపిల్ కంపెనీ (Apple) . ఈసారి ఐఫోన్ 15 కొత్త సీరీస్ వస్తోంది. దీంతో పాటూ వాచ్ అల్ట్రా మోడల్స్ ను కూడా విడుదల చేస్తోంది. అమెరికాలో వండర్ లస్ట్ (Apple Wonderlust event) అనే పేరుతో పెద్ద ఈవెంట్ ను నిర్వహిస్తోంది ఆపిల్ కంపెనీ. కాలిఫోర్నియాలో ఆపిల్ పార్క్ లో ఈ ఈవెంట్ ఇవాళ రాత్రి జరగనుంది. భారత కాలమాన ప్రకారం రాత్రి 10.30 గంటలకు ప్రారంభమవుతుంది. ఆపిల్ యూట్యూబ్ ఛానెల్, ఆపిల్ టీవీ ప్లస్, ఆపిల్.కామ్ వెబ్ సైట్, ఆపిల్ డెవలపర్ యాప్స్లో ప్రత్యక్ష ప్రసారం జరుగుతుంది. ఈ ఈవెంట్ లో ఆపరేటింగ్ సిస్టమ్ కు సంబంధించిన అప్ డేట్స్ కూడా వచ్చే అవకాశం ఉంది.
వండర్ లస్ట్ ఈవెంట్ లో ఐఫోన్ 15 సీరీస్ స్మార్ట్ ఫోన్లను ఆపిల్ కంపెనీ లాంఛ్ చేయనుంది. ఐఫోన్ 15, 15 ప్లస్, 15ప్రో, 15 ప్రో మాక్స్ ఫోన్లు రిలీజ్ అవుతున్నాయి. హైదరాబాద్ లో కూడా :పోన్ 15 సీరీస్ ను రేపు లాంఛ్ చేస్తున్నారు. 15 సీరీస్ ఫోన్లు రెండు, మూడు వారాల్లోనే కొనుగోలుకు అందుబాటులోకి వస్తాయని చెబుతోంది కంపెనీ. మరో విశేషం ఏంటంటే...ఈసారి ఐఫోన్లు భారత్లోనే తయారవుతున్నాయి.
ఇక ఐఫోన్ 15 సీరీస్ తో పాటూ ఆపిల్ ఐవోఎస్ 17 (Apple IOS 17), ఐప్యాడ్ ఓఎస్ 17, మ్యాక్ ఓ ఎస్14, టీవీ ఓఎస్17, వాచ్ ఓఎస్10, మ్యాక్స్ ఓఎస్ సోనామా కాక ఆపరేటింగ్ సిస్టమ్ కు సంబంధించి అప్ డేట్స్ గురించి కూడా అనౌన్స్ చేసే అవకాశం ఉంది. వీటితో పాటూ ఆపిల్ వాచ్ సిరీస్ , అల్ట్రా 9 కూడా లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఐఫోన్ 15 ధర ఎంతుంటుందో కూడా వండర్ లస్ట్ ఈవెంట్లోనే ప్రకటిస్తారు. అలాగే డిస్ ప్లే, ఫీచర్లను కూడా రివీల్ చేస్తారు.
Also Read: కవాసకి నింజా లాంచ్…ఫీచర్లు చూస్తే పిచ్చెక్కాల్సిందే మావ..!!