BIG BREAKING: చిత్తుగా ఓడిపోయిన ట్రంప్ పార్టీ..జేడీ వాన్స్ తమ్ముడికీ తప్పని ఓటమి

అమెరికాలో నాలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల్లో వర్జీనియాలో ట్రంప్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. అక్కడ డెమోక్రాట్ అభ్యర్థి అబిగైల్ సపాన్ బర్గర్ గవర్నర్ గా ఎన్నికయ్యారు.

New Update
viriginia

అమెరికా(america) లో ఇది ఎన్నికల వారం. సాధారణంగా అమెరికా అధ్యక్ష్య పదవికి పోటీ వున్న ఎన్నికలే ప్రపంచపు దృష్టిని ఆకర్షిస్తాయి. కానీ ఈ ఏడాది ఎన్నికలూ ప్రపంచం దృష్టిని కాకపోయినా అమెరికా మొత్తాన్నీ ఆకర్షిస్తున్నాయి. ఇక్కడ కాలమానం ప్రకారం ఈ రోజు నాలుగు పెద్ద రాష్ట్రాలైన న్యూయార్క్, వర్జీనియా, కాలిఫోర్నియా, న్యూజెర్సీల్లో గవర్నర్, మేయర్ ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రస్తుతం అమెరికా గవర్నమెంట్ షట్ డౌన్ నడుస్తున్న కారణంగా ఈ నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు చాలా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

వర్జీనియాలో రిపబ్లికన్స్ కు ఎదురుదెబ్బ..

ఇందులో వర్జీనియా రాష్ట్ర ఎన్నికల రిజల్ట్స్ వచ్చేశాయి. ట్రంప్ రిపబ్లికన్ పార్టీకి ఇక్కడ ఎదురు దెబ్బ తగిలింది. రిపబ్లిక్న్ పార్టీ సీయర్స్ ఓటమి పాలవ్వగా..డెమోక్రాట్ అభ్యర్థి అబిగైల్స్పాన్ బర్గ్ గవర్నర్ గా ఎన్నికయ్యారు. అబిగైల్ కు 14.80 లక్షల ఓట్లు పోలవ్వగా, సీయర్స్ కు 11.61 లక్షల ఓట్లు వచ్చాయి. అబిగైల్ 3.20 లక్షల ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. వర్జీనియా చరిత్రలో మొదటి మహిళా గవర్నర్ గా అబిగైల్ చరిత్ర సృష్టించారు.

జేడీవాన్స్ తమ్ముడికీ తప్పని ఓటమి..

మరోవైపుసిన్సినాటి మేయర్ ఎన్నికల్లో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సవతి తమ్ముడు, రిపబ్లకన్ పార్టీ అభ్యర్థి కోరీబౌమన్ కూడా ఓడిపోయారు. ఈయనపై డెమొక్రాట్ అఫ్తాబ్ పురేవాల్ గెలుపొందారు. ఆఫ్తాబ్వరుగా రెండవ సారి మేయర్ గా ఎన్నికయ్యారు. పురేవల్ తొలిసారి 2021లో మేయర్‌గా ఎన్నికయ్యారు. మే నెలలో జరిగిన ఆల్ పార్టీ మున్సిపల్ ప్రైమరీలో ఆయన 80% కంటే ఎక్కువ ఓట్లతో గెలిచారు.

Also Read: BIG BREAKING: న్యూ యార్క్ లో చరిత్ర సృష్టించిన జోహ్రాన్..మొదటి భారత సంతతి వ్యక్తి

Advertisment
తాజా కథనాలు