Zelensky: శాంతి ఒప్పందం కోసం ఆ పని చేసేది లేదు.. ట్రంప్‌కు కౌంటర్ ఇచ్చిన జెలెన్‌స్కీ

వచ్చేవారం ట్రంప్‌.. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో ఉక్రెయిన్-రష్యా మధ్య శాంతి ఒప్పందంలో భుభాగాల మార్పిడి ఉంటుందనే సంకేతాలు ఇచ్చారు. దీనిపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తీవ్రంగా స్పందించారు.

New Update
Zelensky Rejects Ceding Land to Russia After Trump Suggests a Land Swap

Zelensky Rejects Ceding Land to Russia After Trump Suggests a Land Swap

2022 ఫిబ్రవరిలో మొదలైన రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. తాను అమెరికా అధ్యక్షుడు అయితే యుద్ధాన్ని ఆపుతానని ట్రంప్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఫలితం లభించడం లేదు. ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇందులో భాగంగా వచ్చేవారం ట్రంప్‌.. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో ఉక్రెయిన్-రష్యా మధ్య శాంతి ఒప్పందంలో భుభాగాల మార్పిడి ఉంటుందనే సంకేతాలు ఇచ్చారు. దీనిపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తీవ్రంగా స్పందించారు. శాంతి ఒప్పందం కోసం తమ భూభాగాన్ని వదులుకునేది లేదని తేల్చిచెప్పారు. 

Also Read: పాపం అక్క.. సోదరుడికి రాఖీ కట్టేందుకు 14 ఏళ్లుగా ఎదురుచూపులు

ఇక వివరాల్లోకి వెళ్తే.. ట్రంప్‌ ఆగస్టు 15న అలస్కాలో పుతిన్‌తో సమావేశం కానున్నట్లు తన ట్రూత్ ఖాతాలో తెలిపారు. దీనిపై తాజాగా మీడియాతో మాట్లాడారు.  '' రష్యా-ఉక్రెయిన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరుతుంది. దీనికోసం ఇరుదేశాలు కొన్ని భూభాగాలు వెనక్కి తీసుకోవడం, అలాగే మార్చుకోవడం అనేది జరుగుతుంది. ఇరుపక్షాలకు మేలు జరిగే విధంగానే ఈ మార్పిడి ఉంటుందని'' ట్రంప్ అన్నారు. కానీ ఏయే ప్రాంతాల్లో మార్పులు జరుగుతాయనే విషయాలు చెప్పలేదు. 

Also Read: ధర్మస్థల కేసులో బిగ్ ట్విస్ట్..బాహుబలి కొండ దగ్గర తవ్వకాలు

ముందుగా ట్రంప్.. పుతిన్, జెలెన్‌స్కీతో కలిసి అలస్కాలో త్రైపాక్షిక సమావేశం నిర్వహించాలని అనుకున్నారు. అమెరికా ప్రత్యేక రాయబారి అయిన స్టీవ్‌ విట్‌కాఫ్‌ కూడా ఇటీవల రష్యాలో పర్యటించినప్పడు ఈ విషయాన్ని చెప్పారు. కానీ అక్కడి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఈ క్రమంలోనే మొదటగా పుతిన్‌తో చర్చలు జరిపి శాంతి ఒప్పందం కుదర్చాలని ట్రంప్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

Also Read: సీతక్క రాఖీ కట్టగానే నోట్ల కట్ట బహుమతిగా ఇచ్చిన మంత్రి కోమటిరెడ్డి.. వీడియో వైరల్!

మరోవైపు ట్రంప్-పుతిన్ సమావేశం వార్తలపై జెలెన్‌స్కీ తీవ్రంగా స్పందించారు. '' ఉక్రెయిన్ సమగ్రతను దెబ్బతీసే విధంగా ఉండే ఏ చర్యలకు ఆమెదించం. శాంతి కోసం నిర్వహించే మీటింగ్స్‌లో మా గొంతుకను వినిపించాల్సిందే. ఆక్రమణదారుకు మా భూభాగాన్ని ఇవ్వలేం. ఉక్రెయిన్ లేకుండా జరిపే చర్చలు ఎలాంటి పరిష్కారానికి వచ్చిన అవి శాంతి వ్యతిరేకమే. ఇలాంటి నిర్జీవ పరిష్కారాలు ఏమి పనిచేయడని'' జెలెన్‌స్కీ అన్నారు. ఇదిలాఉండగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆపాలని, దౌత్య పరంగా శాంతి ఒప్పందం కుదుర్చుకోవాలని అనేక దేశాలు సూచిస్తున్నాయి. అయినప్పటికీ ఇరుదేశాల మధ్య ఇంకా యుద్ధం కొనసాగుతూనే ఉంది. 

Also Read: ధర్మస్థల కేసులో కీలక పరిణామం.. తవ్వకాల్లో దొరకని ఆస్తికలు.. ఎంత తవ్వుతున్న మట్టే!

Advertisment
తాజా కథనాలు