చలికాలంలో ఏవో రెండు, మూడు రాష్ట్రాలు తప్ప మొత్తం అమెరికా అంతా మంచు దుప్పటి కప్పేసుకుంటుంది. దాదాపు మూడు నుంచి నాలుగు నెలల పాటూ స్నోలో కూరుకుపోతుంది. రోజురోజుకూ డ్రాప్ అయ్యే ఉష్ణోగ్రతలతో చలికి వణికిపోతారు అక్కడి ప్రజలు. ఇది వారికి సర్వసాధారణమే. మంచు పడడం సాధారణమే అయినా మంచు తుఫానులను తట్టుకోవడం మాత్రం సాధారణం కాదు. మామూలుగా ఉష్ణోగ్రతలు తగ్గి మంచు పడితే అంత ఎఫెక్ట్ ఉండదు. కానీ ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు డ్రాప్ అయిపోయి అద కాస్తా మంచు తుఫానుకు దారి తీస్తే పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. అమెరికాలో ఎంత చలి తీవ్రతకు తట్టుకునే ఏర్పాట్లు ఉన్నా...మంచు తుఫానుల తాకిడికి మాత్రం బలవ్వకతప్పదు.
గత పదేళ్ళల్లో లేదు..
ఇప్పుడు ఈ భయమే వణికిస్తుంది అమెరికా ప్రజలును. మరో రెండు, మూడు రోజుల్లో తీవ్రమైన మంచు తుఫాను అమెరికాలో చాలా రాష్ట్రాలను చుట్టు ముట్టేయనుంది. దీంతో అనేక రాష్ట్రాల్లో భారీ స్థాయిలో మంచు, వర్షంతోపాటు అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. గత పదేళ్ళల్లోనే ఇలాంటి భారీ తుఫాను రాలేదని చెబుతున్నారు. ఇది ఈ దశాబ్దిలోనే అతి తీవ్ర తుపానుగా వాతావరణశాఖ అంచనా వేస్తున్నారు. ఈ మంచు తుఫాను దాదాపు పదిహేనుకుపైగా రాష్ట్రాల మీద ప్రభావం చూపించనుంది. దీనివలన సుమారు 6కోట్ల మంది ప్రభావితమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
Also Read: అభ్యర్థులకు అలెర్ట్.. CUET PG రిజిస్ట్రేషన్ స్టార్ట్.. ఇలా అప్లై చేసుకోండి!
ఎమర్జెన్సీ విధించిన రాష్ట్రాలు..
మధ్య అమెరికాలో మొదలయ్యే శీతల తుఫాను తూర్పు దిశగా కదులుతోందని యూఎస్ నేషనల్ వెదర్ సర్వీఎస్ చెబుతోంది. పోలార్ వర్టెక్స్ కారణంగా ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. మిస్సౌరీ నుంచి మధ్య అట్లాంటిక్ వరకు ఇది విస్తరించనుందని, గడిచి దశాబ్దిలోనే అతి తీవ్ర శీతల తుపానుగా కానుందని వాతారణ శాఖ చెబుతోంది. అమెరికాలో 2011 తర్వాత ఇలాంటి తుఫాను రావడం ఇద మొదటిసారని అంటున్నారు. వారం రోజుల పాటూ ఈ తుఫాను ఉండనుందని అంచనా వేస్తున్నారు. వాతావరణశాఖ హెచ్చరికలతో అనేక రాష్ట్రాలు అప్రమత్తం అయ్యాయి. కెంటకీ, వర్జీనియా, కాన్సాస్, ఆర్కాన్సాస్ రాష్ట్రాలు ఇప్పటికే ఎమర్జెన్సీ విధించాయి. కన్సాస్, ఇండియానా ప్రాంతాల్లో 20 సెం.మీ, వర్జీనియాలో 10 నుంచి 25సెం.మీ మేర మంచు కురిసే అవకాశం ఉన్నట్లు అంచనాలున్నాయి.
Also Read: HYD: హైదరాబాద్ మినర్వా హోటల్‌లో భారీ అగ్ని ప్రమాదం