హిమాయత్ నగర్ మినర్వా హోటల్ అని ప్రమాదం అక్కడి ప్రజలు భయపెట్టింది. అక్కబ బిజీ ఏరియాలో నిత్యం మనుషులు తిరిగే చోఉలో మినర్వా హోటల్ ఉది. చుట్టుపక్కల చాలా షాపులు కూడా ఉన్నాయి. అలాంటి చోట అగ్ని ప్రమాదం జరగడంతో అందరూ ఆందోళన చెందారు కిచెన్ ఎగ్జాస్ట్ నుంచి మంటలు చెలరేగి బయటకు వచ్చాయి. పెద్ద ఎత్తున వ్యాపించాయి కూడా. అయితే స్థానికులు ఇచ్చిన సమాచారంతో నారాయణగూడ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రాణ నష్టం ఏమీ జరగలేదు కానీ..ఏ మేరకు ఆస్తి నష్టం జరిగిందన్నది తెలియరాలేదు. Also Read: ఉచిత బస్ ఎఫెక్ట్..అక్కడ 15 శాతం పెరిగిన ఛార్జీలు..మరి మన సంగతేంటో! Also Read: ట్రెండింగ్లో ఓయో రూమ్స్.. దివాలా తీయడం ఖాయమట! మరోచోట కూడా.. మినర్వా హోటల్ అగ్ని ప్రమాదం జరిగిన సమయానికే రంగారెడ్డి జిల్లా మైలార్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బుద్వేల్ రైల్వే స్టేషన్ దగ్గర లారీ పార్కింగ్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. మంటలకు తోడు గాలి, దట్టమైన పొగ కమ్ముకోవడంతో అక్కడ ఉన్న జనం చాలా ఇబ్బంది పడ్డారు. దాంతో పాటూ ఘటనా స్థలంలో ఉన్న మెకానిక్ షెడ్లు అన్నీ పూర్తిగా కాలి దగ్ధం అయిపోయాయి. నష్టం 10 లక్షల వరకూ ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. హైదరాబాద్‌లో ఈ మధ్య కాలంలో ఎక్కువగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. కొన్నిరోజుల క్రితం హైటెక్ సిటీలో ఆఫీస్ బిల్డింగ్లో మంటలు అంటుకున్నాయి. అంతకు ముందు మరో చోట కూడా అని ప్రమాదం జరిగింది. అయితే ఈ వరుస ప్రమాదాలకు కారణమేంటో మాత్రం తెలియడం లేదు. Also Read: అభ్యర్థులకు అలెర్ట్.. CUET PG రిజిస్ట్రేషన్ స్టార్ట్.. ఇలా అప్లై చేసుకోండి!