Jyothi Malhotra: యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసు.. విచారణలో బయటపడ్డ షాకింగ్ విషయాలు

ఇంటెలిజెన్స్ ఏజెంట్లతో సంబంధాలున్నాయని జ్యోతి మల్హోత్రా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ అధికారి డానిష్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్లు కూడా ఒప్పుకుంది. ప్రస్తుతం జ్యోతి రిమాండ్‌లో ఉన్న విషయం తెలిసిందే.

New Update
Jyothi Malhotra

Jyothi Malhotra

హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్‌కి గూఢచర్యం చేస్తుందనే ఆరోపణలతో పోలీసులు ఇటీవల ఆమెను అరెస్టు చేశారు. అయితే ప్రస్తుతం ఆమె రిమాండ్‌లో ఉండగా పోలీసులు ఆమెను విచారిస్తున్నారు. ఈ క్రమంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇంటెలిజెన్స్ ఏజెంట్లతో సంబంధాలున్నాయని జ్యోతి విచారణలో ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. అలాగే న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ అధికారి డానిష్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్లు విచారణలో జ్యోతి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.

ఇది కూడా చూడండి: Pakistan: పాకిస్తాన్ లో రాహుల్ గాంధీ ట్రెండింగ్..వాడేసుకుంటున్న మీడియా..

ఇది కూడా చూడండి: Tapan Deka:  ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ పదవీ కాలం పొడిగింపు...మరో ఏడాది వరకు

మొత్తం 10 రోజులు..

ఇదిలా ఉండగా పోలీసులు జ్యోతి మల్హోత్రా వ్యక్తిగత డైరీని స్వాధీనం చేసుకున్నారు. పాకిస్తాన్ పర్యటన నుండి తిరిగి వచ్చిన తర్వాత ఆమె తన డైరీని ఇంగ్లీషులో కాకుండా హిందీలో రాసినట్లు పోలీసులు తెలిపారు. పాకిస్తాన్‌ పర్యటన 10 రోజులు పూర్తి అయిన తర్వాత సొంత దేశమైన భారత్‌కు తిరిగి వచ్చాను. జ్యోతి ఒక పేజీలో లవ్ యు ఖుష్ ముష్ అని రాసి ఉంది. ఆమె ఎవరి కోసం రాసిందనే విషయం ఇంకా తెలియదు. అలాగే సవితను పండ్లు తీసుకురమ్మని చెప్పు అని కూడా రాసి ఉంది. 

ఇది కూడా చూడండి: Elon Musk: ట్రంప్‌కి బిగ్ షాకిచ్చిన ఎలాన్ మస్క్.. ‘అందులో ఖర్చు తగ్గిస్తాను’

ఈ సరిహద్దులు ఎప్పటి వరకు ఉంటాయో తెలియదు. కానీ హృదయాల మనో వేదనలు మాయమవుతాయి. మనమందరం ఒకే భూమికి, ఒకే నేలకి చెందినవారమని తన డైరీలో జ్యోతి రాసుకుంది. పాకిస్తాన్ ఆతిథ్యం బాగుందని జ్యోతి తన డైరీలో ప్రశంసించింది. అలాగే అక్కడ దేవాలయాలు, గురు ద్వారాలు వంటి మతపరమైన ప్రదేశాలు బాగున్నాయి. వీటిని అందరూ కూడా ఈజీగా చేరుకోవచ్చని తెలిపింది. దేశ విభజన సమయంలో విడిపోయిన కుటుంబాలతో మళ్లీ తిరిగి కలవాలనే కోరిక ఉందని కూడా ఆమె డైరీలో ప్రస్తావించిందని పోలీసులు తెలిపారు. 

ఇది కూడా చూడండి:TGCrime : భర్త ఫోన్ కు అశ్లీల ఫోటోలు పంపిన కానిస్టేబుల్‌...! ఉరేసుకుని భార్య...

Advertisment
Advertisment