/rtv/media/media_files/2025/09/21/why-trump-hikes-h-1b-visa-fees-2025-09-21-16-39-11.jpg)
Why Trump Hikes H-1B visa fees
అమెరికా అధ్యక్షుడు ట్రంప్(Donald Trump) H1B వీసా వార్షిక రుసమును లక్ష డాలర్లకు (రూ. 88 లక్షలకు పైగా) పెంచిన సంగతి తెలిసిందే. ట్రంప్ ఇలా సడెన్‌గా ఎందుకు నిర్ణయం తీసుకున్నారో అనేదానిపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే దీనిపై వైట్‌హౌస్ స్పందించింది. చాలావరకు అమెరికన్ కంపెనీలు అమెరికన్ ఉద్యోగులను తొలగించి వాళ్ల స్థానంలో విదేశీ ఉద్యోగులను నియమించుకుంటున్నాయని తెలిపింది. అమెరికా వనరులు, ఉద్యోగాలపై ముందుగా అమెరికన్లకే హక్కు ఉంటుందని ఇప్పటికే చాలాసార్లు ట్రంప్ చెబుతూ వస్తున్నారు.
Also Read: అమెరికా విమాన టికెట్లు కావాలనే బ్లాక్ చేశారా ? .. వెలుగులోకి సంచలన నిజాలు
Trump Hikes H-1B Visa Fees
శ్వేతసౌధం చెప్పిన వివరాల ప్రకారం.. తాజాగా ఓ కంపెనీ 16 వేల మంది అమెరికన్ ఉద్యోగులను తొలగించింది. ఆ కంపెనీ 5,189 H1బీ పర్మిషన్లు పొందింది. 1698 వీసా పర్మిషన్లను పొందిన మరో కంపెనీ 2400 ఉద్యోగాలను తగ్గించింది. ఇంకో కంపెనీ 25,075 H1B వీసా(h1-b-visa) అనుమతులు పొందింది. 2022 నుంచి ఇప్పటిదాకా ఏకంగా 27 వేల మంది అమెరికన్ ఉద్యోగులను తొలగించింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మరో కంపెనీ 1137 H1బీ వీసాలు పొందింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో 1000 అమెరికన్ ఉద్యోగులకు లేఆఫ్ ఇచ్చింది. అమెరికన్ ఐటీ ఉద్యోగులకు ముందుగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే ఇలా ఉద్యోగంలో నుంచి తొలగించడం, అలాగే విదేశీ టెక్కీలకు శిక్షణ ఇవ్వడంపై విమర్శలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ట్రంప్ ప్రభుత్వం హెచ్1బీ వీసా ఫీజును పెంచినట్లు తెలుస్తోంది.
Also Read: ట్రక్ డ్రైవర్ పోర్న్ చూస్తూ యాక్సిడెంట్.. వ్యక్తి మృతి