అమెరికా విమాన టికెట్లు కావాలనే బ్లాక్‌ చేశారా ? .. వెలుగులోకి సంచలన నిజాలు

అమెరికాలో ట్రంప్ సపోర్టర్ల టీమ్‌ మగా (మేక్ అమెరికా గ్రేట్ అగైన్), ఆన్‌లైన్ ఫోరమ్‌ 4 చాన్ భారతీయ H1 బీ వీసాదారులను ఇబ్బంది పెట్టేందుకు యత్నిస్తున్నాయి. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

New Update
4Chan, MAGAs unite in 'clog the toilet' op to block H-1B workers flying back

4Chan, MAGAs unite in 'clog the toilet' op to block H-1B workers flying back

అమెరికాలో ట్రంప్ సపోర్టర్ల టీమ్‌ మగా (మేక్ అమెరికా గ్రేట్ అగైన్), ఆన్‌లైన్ ఫోరమ్‌ 4 చాన్ భారతీయ H1 బీ వీసాదారులను ఇబ్బంది పెట్టేందుకు యత్నిస్తున్నాయి. క్లాగ్ ది టాయిలెట్‌ పేరుతో ఆపరేషన్ నిర్వహించినట్లు వార్తలు వస్తున్నాయి. హెచ్‌1 బీ వీసాల కొత్త రూల్స్ ఆదివారం నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ క్రమంలోనే చాలా వరకు కంపెనీలు ఇతర దేశాల్లో తమ H1 బీ ఉద్యోగులను వెంటనే అమెరికా వచ్చేయాలని కోరుతున్నాయి. ఎక్కువ మంది భారతీయులు ఈ వీసా మీదే ఆధారపడి ఉన్నారు. దీంతో భారత్‌ నుంచి అమెరికా వెళ్లేందుకు టికెట్ల కోసం ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 

Also Read: సాయంత్రం 5 గంటలకు మీడియా ముందుకు మోదీ.. ఏం చెప్పబోతున్నారు?

ఇలా ఎక్కువమంది పోటెత్తడంతో విమాన టికెట్ ధరలు రూ.40 వేల నుంచి రూ.80 వేలకు చేరుకున్నాయి.  ఈ నేపథ్యంలోనే భారతీయులు అమెరికాకు తిరిగి రాకుండా '4 చాన్' అనే ఆన్‌లైన్ ఫోరమ్‌ విమాన టికెట్లను కొనకుండా రిజర్వేషన్ల పేరిట బ్లాక్ చేసేందుకు ప్రయత్నించింది. H1 బీ వీసాదారులు టికెట్లు కొనుగోలు చేయకుండా అడ్డుకునేందుకు ఇలా చేసినట్లు సమాచారం. భారత్ నుంచి వచ్చే విమానాల టికెట్లను బుక్ చేసేందుకు పలు విండోలు తెరిచి కొన్ని ఫ్లైట్లలో సీట్లు ఎంచుకొని 15 నిమిషాలు వదిలేయాలని చెప్పింది. సీటు హోల్డ్‌ అనే ఫీచర్‌తో ఇలా చేసింది. ఒకే సమయంలో పలు విమానాలు ఎంచుకోవాలని సూచనలు చేసింది. భారతీయులను వాళ్ల దేశంలోనే ఉంచాలనుకుంటున్నారా ? రిజర్వేషన్ వ్యవస్థను బ్లాక్‌ చేయాలని కోరింది. దీంతో కొంతమంది తాము బ్లాక్‌ చేసిన సీట్ల స్క్రీన్‌షాట్లను ఆన్‌లైన్‌లో పోస్టు చేశారు.   ఓ యూజర్ అయితే ఏకంగా 1000 సీట్లను తొక్కి పట్టానని చెప్పాడు.   

Also Read: ఒరే అజము లగెత్తరో.. భారీగా పెరిగిన అమెరికా ఫ్లైట్ టికెట్ల ధరలు.. ఎయిర్‌పోర్టుల్లో గందరగోళం!

హెచ్‌ 1 బీ వీసా ధరలను లక్ష డాలర్లుకు (రూ.88 లక్షలు) పెంచుతూ ట్రంప్‌ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.అయితే శనివారం అర్ధరాత్రి దీనిపై మరో స్పష్టతం వచ్చింది. ఇప్పటికే ఉన్నవారికి రూ.లక్ష డాలర్ల ఫీజు వర్తించదని వైట్‌హౌస్ తెలిపింది. దీంతో H1బీ వీసాదారులు ఊపిరి పీల్చుకున్నారు. 

Advertisment
తాజా కథనాలు