/rtv/media/media_files/2025/09/21/road-accident-2025-09-21-16-16-52.jpg)
మొబైల్ ఫోన్‌లో అశ్లీల చిత్రాలు (పోర్న్) చూస్తూ డ్రైవింగ్ చేసిన ఓ ట్రక్ డ్రైవర్(truck-driver), కారును ఢీకొట్టాడు. ఆ కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి మరణించాడు. ఈ దారుణ ఘటన యూకేలోని లాంకాషైర్‌లో చోటుచేసుకుంది. 43 ఏళ్ల నీల్ ప్లాట్ అనే ట్రక్ డ్రైవర్, ఎమ్58 మోటర్‌వేపై తన ట్రక్కును నడుపుతున్నప్పుడు ఈ ప్రమాదం జరిగింది.
వివరాల్లోకి వెళ్తే, మే 17, 2024న డానియెల్ ఐచిసన్ అనే 46 ఏళ్ల వ్యక్తి తన కారులో ఇంటికి వెళ్తుండగా, ట్రాఫిక్‌లో ఆగి ఉన్నాడు. అదే సమయంలో, వెనుక నుంచి వస్తున్న ట్రక్ డ్రైవర్ నీల్ ప్లాట్ తన మొబైల్‌లో అశ్లీల కంటెంట్ చూస్తూ, రోడ్డుపై చూసుకోలేదు. దీంతో వేగంగా వస్తున్న ట్రక్, ఐచిసన్ కారును ఢీకొట్టింది. ఆ టైంలో ఐచిసన్ కూడా ఆయన భార్యతో ఫోన్‌లో మాట్లాడుతున్నాడు.
Also Read : అమెరికా విమాన టికెట్లు కావాలనే బ్లాక్ చేశారా ? .. వెలుగులోకి సంచలన నిజాలు
Truck Driver Killed A Man By Watching Porn
BREAKING: #Tragic M58 crash in #Lancashire claims life of dad-of-two Danny Aitchison, 46, after HGV driver Neil Platt, 43, rear-ended his car at 57mph, distracted by porn images on his phone seconds prior. @nypostpic.twitter.com/zccuTMznh1
— Stephanie Hamilton 🇺🇸 (@StephanieHSpoke) September 20, 2025
ట్రక్ బలంగా ఢీకొట్టడం(road accident) తో ఐచిసన్ కారు ముందుకు వెళ్లి మరో ట్రక్‌ను ఢీకొట్టింది. ఆ తర్వాత కారు మంటల్లో చిక్కుకుంది. ఈ ప్రమాదంలో ఐచిసన్ అక్కడికక్కడే మరణించాడు. కోర్టు విచారణలో, ప్లాట్ తన ఫోన్‌లో పోర్న్, ఇతర సోషల్ మీడియా యాప్‌లను ప్రమాదం జరగడానికి కొద్దిసేపటి ముందు చూసినట్లు డాష్‌క్యామ్ ఫుటేజ్, ఫోన్ రికార్డుల ద్వారా తేలింది.
ఈ ఘటనపై విచారణ జరిపిన న్యాయమూర్తి, "నీ నిర్లక్ష్యం, స్వార్థపూరిత వైఖరి అపారమైనది. నువ్వు ఒక టన్నుల బరువున్న ప్రమాదంలా మారావు" అని తీవ్రంగా మందలించారు. ప్రజల ప్రాణాలను లెక్కచేయకుండా ఇలాంటి చర్యలకు పాల్పడడం అత్యంత ప్రమాదకరమని, డ్రైవర్లంతా రోడ్డు భద్రతపై దృష్టి పెట్టాలని పోలీసులు హెచ్చరించారు. ఈ కేసులో నీల్ ప్లాట్‌కు 10 సంవత్సరాల జైలు శిక్ష విధించినట్లు కోర్టు ప్రకటించింది. ఈ సంఘటన డ్రైవింగ్ సమయంలో ఫోన్‌ల వాడకం ఎంత ప్రమాదకరమో మరోసారి స్పష్టం చేసింది.
Also Read : శత్రువులపై ప్రతీకారం తీర్చుకోవాలి.. ఆమెకు ట్రంప్ సీక్రెట్ మెసేజ్!