Nobel Peace Prize: డొనాల్డ్‌ ట్రంప్‌కు బిగ్‌షాక్‌ ... ఈ సారి నోబెల్ ప్రైజ్ ఎవరికంటే?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు బిగ్‌షాక్‌ తగిలింది. నోబెల్‌ శాంతి బహుమతిపై ఆయన ఎన్నో ఆశలు పెట్టుకోగా చివరకు నిరాశే మిగిలింది. ట్రంప్‌కు నోబెల్‌ శాంతి బహుమతి దక్కలేదు.  2025 సంవత్సరానికి గానూ మరియా కురీనా మచాడోకు నోబెల్‌ శాంతి బహుమతి లభించింది.

New Update
prizenobel

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌(Donald Trump) కు బిగ్‌షాక్‌ తగిలింది. నోబెల్‌ శాంతి బహుమతిపై ఆయన  ఎన్నో ఆశలు పెట్టుకోగా చివరకు నిరాశే మిగిలింది. ట్రంప్‌కు నోబెల్‌ శాంతి బహుమతి దక్కలేదు.  2025 సంవత్సరానికి గానూ వెనెజులా మాజీ పార్లమెంట్‌ సభ్యురాలు మరియా కురీనా మచాడోకు నోబెల్‌ శాంతి బహుమతి లభించింది. 

Also Read :  Nobel Prize: నోబెల్ బహుమతిలో అసలేముంటుంది? అన్ని విభాగాలకు ఒకేలా ఉంటుందా?

ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం

ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం కృషిచేస్తున్నారు మరియా.   ఆమె ప్రతిపక్షంలో ఐక్యత కోసం కృషి చేసిన ఒక ముఖ్య నాయకురాలిగా, నియంతృత్వంలో స్వేచ్ఛ కోసం ధైర్యంగా పోరాడిన వ్యక్తిగా నార్వేజియన్ నోబెల్ కమిటీ  పేర్కొంది.

Also Read :  ఈ రంగాల వారికి బిగ్ షాక్.. హెచ్‌-1బీ వీసాల్లో మళ్లీ మార్పులు.. ఇక వెళ్లడం కష్టమే!

మారియా కొరీనా మచాడో వయస్సు 57 .. వెనిజులాలో పుట్టారు.  ఆండ్రెస్ బెల్లో కాథలిక్ యూనివర్శిటీ నుండి ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ, ఇన్స్టిట్యూటో డి ఎస్టూడియోస్ సుపీరియోరెస్ డి అడ్మినిస్ట్రేషన్ (IESA) నుండి ఫైనాన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ చేశారు. 2011 జనవరి 5 నుండి 2014 మార్చి 21 వరకు నేషనల్ అసెంబ్లీ సభ్యురాలిగా పనిచేశారు.ఆమెపై 15 సంవత్సరాల పాటు పదవిని చేపట్టకుండా 2023 జూన్ 30న నిషేధం విధించబడింది.

వెనెజులాలో నిరంకుశత్వ, నికోలస్ మదురో పాలన పెరుగుతున్నప్పటికీ, ఆమె ప్రజాస్వామ్యం కోసం..  మానవ హక్కుల కోసం అవిరామంగా పోరాడారు.  దేశంలో పౌరుల ప్రజాస్వామ్య హక్కులు  తీవ్రంగా ఉల్లంఘనకు గురవుతున్న సమయంలో, ఆమె వాటిని పరిరక్షించడానికి తన జీవితాన్ని అంకితం చేశారు. ఒకప్పుడు విచ్ఛిన్నమై ఉన్న ప్రతిపక్ష దళాలను ఏకం చేయడంలో ఆమె కీలక పాత్ర పోషించారు, స్వేచ్ఛాయుత ఎన్నికల డిమాండ్‌పై అందరినీ ఒకతాటిపైకి తీసుకువచ్చారు. 2023లో జరిగిన ప్రతిపక్ష ప్రైమరీ ఎన్నికలలో అనర్హత వేటు పడినప్పటికీ, ఆమె దేశంలో స్వేచ్ఛాయుత ఎన్నికల ప్రక్రియ కోసం గట్టిగా నిలబడ్డారు.

బెదిరింపులు, అరెస్టులు, ప్రాణహాని ఉన్నప్పటికీ, ఆమె వెనెజులాలోనే ఉంటూ తన పోరాటాన్ని కొనసాగించారు. ఇది దేశంలోని లక్షలాది మంది ప్రజలకు ధైర్యాన్ని, స్ఫూర్తిని ఇచ్చింది.ఆమె వెనెజులా సమాజం సైనికీకరణ కాకుండా, ప్రజాస్వామ్య మార్గాల ద్వారా శాంతియుత పరిష్కారం కోసం నిలబడ్డారు.

Advertisment
తాజా కథనాలు