/rtv/media/media_files/2025/10/10/modi-uk-2025-10-10-08-26-30.jpg)
యూఎస్‌లో చదువు కష్టమైపోతున్న వేళ మిగతా దేశాల అవకాశాలు భారత్ తలుపు తడుతున్నాయి. ఇప్పటికే చైనా, యూకేలు తమ దేశం వచ్చి చదువుకోండి అంటూ ఆహ్వానించాయి. దానికి తోడు ఇప్పుడు ఏకంగా యూకే యూనివర్శిటీలే భారత్ కు వస్తున్నాయి. నిన్న బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ పర్యటనలో రెండు దేశాధినేతలూ దీనికి సంబంధించిన ఒప్పందం చేసుకున్నారు. దీని ప్రకారం తొమ్మిది బ్రిటీష్ యూనివర్శిటీలు మన దేశంలో క్యాంపస్‌లను ఏర్పాటు చేయనున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా భారత ప్రధాని మోదీ ప్రకటించారు. కీర్ సటార్మర్ తో పాటూ యూకే విదయా ప్రతినిధి బృందం కూడా భారత్ పర్యటనకు వచ్చింది. సౌంతాప్టన్ విశ్వవిద్యాలయంతో సహా తొమ్మది ముఖ్యమైన, పెద్ద యూనివర్శిటీలు ఇండియాలో క్యాంపస్‌లను పెడుతున్నాయి. సౌతాంప్టన్ విశ్వవిద్యాలయం గురుగ్రామ్ క్యాంపస్ ఇప్పటికే ప్రారంభించింది. దానిలో మొదటి బ్యాచ్ విద్యార్థులు కూడా చేరారు. ఇప్పుడు ఆ క్యాంపస్ ను మరింత విస్తరించనున్నారు.
Big boost for India–UK education ties!
— Randhir Jaiswal (@MEAIndia) October 9, 2025
Nine UK universities have been approved to set up campuses in India under the New Education Policy.
🇮🇳 🇬🇧 pic.twitter.com/apVTmAiuQx
మన దేశంలోనే ప్రపంచస్థాయి విద్య..
భారత్, యూకేల మధ్య విద్యా సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా అడుగుపడ్డాయని ప్రధాని మోదీ అన్నారు. భారతీయ విద్యార్థులు దేశం విడిచి వెళ్ళకుండా...ఇక్కడే చదువుకునేందుకు ఇది ఉపయోగపడుతుందని చెప్పారు. ఉన్నచోటనే ప్రపంచ స్థాయి విద్యను పొందడం, ఆవిష్కరణలు, నైపుణ్య అభివృద్ధి, పరిశోధనలు లాంటి వాటిని ఇది ప్రోత్సహిస్తుందని అన్నారు. ఐదు ప్రతిష్టాత్మక యూకే విశ్వవిద్యాలయాలు ప్రధాన భారతీయ నగరాల్లో క్యాంపస్‌లను ఏర్పాటు చేయడానికి కట్టుబడి ఉన్నాయని మోదీ తెలిపారు. సౌతాంప్టన్‌తో పాటు, బ్రిస్టల్ విశ్వవిద్యాలయం ముంబైలో కొత్త ఎంటర్‌ప్రైజ్ క్యాంపస్‌ను ప్రారంభించడానికి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నుండి ఆమోదం పొందాయి. ఇవి 2026 వేసవిలో విద్యార్థులను స్వాతగించనున్నాయి.
భారతదేశంలో క్యాంపస్‌లను ఏర్పాటు చేస్తున్న UK విశ్వవిద్యాలయాలు..
1. సౌతాంప్టన్ విశ్వవిద్యాలయం - గురుగ్రామ్ (క్యాంపస్ ఇప్పటికే పనిచేస్తోంది)
2. లివర్‌పూల్ విశ్వవిద్యాలయం - బెంగళూరు
3. యార్క్ విశ్వవిద్యాలయం - ముంబై
4. అబెర్డీన్ విశ్వవిద్యాలయం - ముంబై
5. బ్రిస్టల్ విశ్వవిద్యాలయం - ముంబై
Also Read: TN: కరూర్ ఘటన తర్వాత విజయ్ కు వరుస బాంబు బెదిరింపులు..రోడ్ షోలు వద్దంటూ వార్నింగ్