TS: తెలంగాణ యూనివర్శిటీ ప్రొఫెసర్ల పదవీ విరమణ వయసు పెంపు

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. యూనివర్శిటీ ప్రొఫెసర్ల పదవీ విరమణ వయసును పెంచింది. ప్రస్తుతం 60 ఏళ్ళుగా ఉన్న దీన్ని 65కు పెంచింది. 

author-image
By Manogna alamuru
New Update
OU PG: 'వన్ టైం ఛాన్స్'.. పీజీ బ్యాక్ లాగ్స్ అభ్యర్థులకు ఓయూ బంపర్ ఆఫర్!

తెలంగాణ యూనివర్సిటీ అధ్యాపకుల పంట పండింది. ఇప్పుడు వారు 60 ఏళ్ళకే రిటైర్ అయిపోవక్కర్లేదు. ఇంకో ఐదేళ్లు హాయిగా పని చేసుకోవచ్చును. తెలంగాణ యూనివర్శిటీల్లో  ప్రొఫెసర్ల పదీ విరమణ వయసును పెంచుతూ గవర్నమెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. రిటైర్మెంట్ ఏజ్ ను 60నుంచి 65 ఏళ్ళకు పెంచింది. ఈ మేరకు 2025, జనవరి 30న విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఈ ఏడాది రిటైర్మెంట్ కానున్న ప్రొఫెసర్లు మరో 5 సంవత్సరాల పాటు  కొనసాగనున్నారు. 

ఇది కూడా చదవండి: live-in relationship: పెళ్లి కాకున్నా కలిసి జీవించాలంటే ఈ రూల్స్ పాటించాలి

12 యూనివర్శిటీల్లో 757 మంది ప్రొఫెసర్లు..

తెలంగాణ విద్యాశాఖ పరిధిలో మొత్తం 12 యూనివర్శిటీలు ఉన్నాయి. వీటిల్లో 2, 817 మంది అధ్యాపకులుగా పని చేయాల్సి ఉండగా..ప్రస్తుతం 757 మందే పని చేస్తున్నారు. అంటే 2, 060 పోస్ట్ లు ఖాళగా ఉన్నాయి. ప్రతినెలా ఉస్మానియా, జేఎన్‌టీయూహెచ్, కాకతీయ విశ్వవిద్యాలయాల్లో ఇద్దరు ముగ్గురు చొప్పున పదవీ విరమణ పొందుతున్నారు. ఉదాహరణకు ఉస్మానియా ఎడ్యుకేషన్‌ విభాగంలో ఇద్దరు ప్రొఫెసర్లు మాత్రమే మిగిలారు. ఈ ఇద్దరే అన్ని యూనివర్శిటీలకు డీన్లుగా, బోర్డ్ ఆఫ్ చైర్మన్లుగా వ్యవహరించాల్సి పరిస్థితి ఏర్పడింది. ఎగ్జామ్స్ నిర్వహించడానికి కూడా సరైన కన్వీనర్లు లేరు. కొత్త ప్రొఫెసర్లను నియమించడానికి కూడా అవడం లేదు. పోస్టు ఖాళీ ప్రకటించడం లేదు...ఒకవేళ ప్రకటించినా సరైన అభ్యర్థులు రావడం లేదని చెబుతున్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే అధ్యాపకుల పదవీ విరమణ కాలం పొడిగించాలని విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. 

ఇది కూడా చదవండి: Goreti venkanna: ఒక కమ్యూనిస్టు జీవిత చరిత్ర వంద రామాయణాలకు ధీటుగా ఉంటుంది: గోరటి వెంకన్న!

Advertisment
తాజా కథనాలు