Maria Corina Machado: మరియా కొరీనాకు నోబెల్ శాంతి బహుమతి రావాడానికి కారణం ఇదే.. ఆమె ఏం చేసిందో తెలుసా ?

ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి వెనెజువెలా విపక్ష నేత మరియా కొరీనా మచాడోకు దక్కిన సంగతి తెలిసిందే. ఆ దేశ ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడినందుకు గాను ఆమెకు ఈ ప్రపంచ అత్యున్నత పురస్కారం వరించింది. ఆమె గురించి మరిన్ని వివరాలు ఆ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

New Update
Nobel Peace Prize Winner Maria Corina Machado

Nobel Peace Prize Winner Maria Corina Machado

ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి(nobel-peace-prize) వెనెజువెలా విపక్ష నేత మరియా కొరీనా మచాడో(Maria Corina Machado)కు దక్కిన సంగతి తెలిసిందే. ఆ దేశ ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడినందుకు గాను ఆమెకు ఈ ప్రపంచ అత్యున్నత పురస్కారం వరించింది. ఆమె గురించి మరిన్ని వివరాలు ఆ ఆర్టికల్‌లో తెలుసుకుందాం. 25 ఏళ్ల క్రితం ఆమె మాట్లాడిన మాటలు అప్పట్లో సంచలనం రేపాయి. ''నా దేశం కుప్పకూలుతుంటే నేను ఇంట్లోనే ఉండి చూడలేను. ప్రజల జీవితాల్లో మార్పు రావాలి. బుల్లెట్లకు బదులు బ్యాలెట్లను ఎంచుకుందామని'' అన్నారు. ఎన్నో ఏళ్లుగా ఆమె అణచివేతలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ప్రజల తరఫున గళం వినిపిస్తూనే ఉన్నారు.  

చిన్నారుల కోసం ఫౌండేషన్

వెనెజువెలా 1967 అక్టోబర్‌ 7న మరియా కొరీనా జన్మించారు. ఈమె తల్లి కొరీనా పరిస్కా సైకాలజిస్ట్‌గా పనిచేసేవారు. తండ్రి హెన్రిక్‌ మచాడో జులావోగా స్టీల్‌. ఈయన వ్యాపారవేత్త. మరియా పూర్వీకులు గతంలో వెనెజువెలా స్వతంత్ర్య పోరాటంలో కూడా పాల్గొన్నారు. ఈమె ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ, ఫైనాన్స్‌లో మాస్టర్స్‌ డిగ్రీ చేశారు. 1992లో వీధి బాలలు, అనాథ చిన్నారుల కోసం అటెనియా ఫౌండేషన్‌ను ఏర్పాటు చేశారు. అందులో పనిచేసే సమయంలోనే వెనెజువెలాలో ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాటం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పడంతో ఆమెపై ద్రోహం, కుట్ర కేసులు పెట్టారు. 

జాతీయ అసెంబ్లీకి మరియా

ఇక 2002లో మరియా కొరీనా.. సుమేట్‌ అనే స్వచ్ఛంద సంస్థకు కో ఫౌండర్‌గా పనిచేశారు. దేశంలో ప్రజల ఓటింగ్ హక్కులు కాపాడేందుకు, పారదర్శక ఎన్నికల నిర్వహణ కోసం ఈ సంస్థ పనిచేసేది. దాదాపు పదేళ్ల పాటు ఆమె ఈ స్వచ్ఛంద సంస్థతో కలిసి పనిచేశారు. ఆ తర్వాత 'వెంటె వెనెజువెలా' అనే పేరుతో లిబరల్ పొలిటకల్ పార్టీని స్థాపించారు. 2010లో జాతీయ అసెంబ్లీకి పోటీ చేసిన మరియా.. ఆ ఎన్నికల్లో అత్యధిక ఓట్లతో గెలుపొందారు. 2011లో మొదటిసారిగా జాతీయ అసెంబ్లీలో అడుగుపెట్టారు. 

Also Read: ఈ రంగాల వారికి బిగ్ షాక్.. హెచ్‌-1బీ వీసాల్లో మళ్లీ మార్పులు.. ఇక వెళ్లడం కష్టమే!

ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం

2014లో వెనెజువెలాలో అధిక ద్రవ్యోల్బణం, నిత్యావసర వస్తువుల కొరత, అధ్యక్షుడు నికోలస్ మదురో నేతృత్వంలో నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు జరిగాయి. నిరసనలు తీవ్ర స్థాయిలో జరుగుతున్న క్రమంలో పనామాలో ఆర్గనైజేషన్ ఆఫ్ అమెరికన్ స్టేట్స్‌ సదస్సు జరిగింది. ఇందులో పాల్గొన్న మరియా వెనెజువెలాలో ఉన్న పరిస్థితుల గురించి ప్రసంగం చేశారు. దీంతో అధికారపక్ష నాయకులు ఆమెపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం అక్కడి ప్రభుత్వం ఆమెను బలవంతంగా ఎంపీ పదవి నుంచి బహిష్కరించింది. పలు కేసులు కూడా నమోదయ్యాయి. 

15 ఏళ్ల పాటు అనర్హత వేటు

ఆ తర్వాత 2014 నుంచి 2021 వరకు మరియా.. ఓ స్థానిక రేడియో స్టేషన్‌లో ప్రసారకర్తగా కూడా పనిచేశారు. ఇక్కడ రాజకీయ విశ్లేషణలకు సంబంధించి ఓ టాక్‌షో ఉంది. దానికి ఆమె హోస్ట్‌గా వ్యవహరించారు. ఆ తర్వాత 2023లో మళ్లీ రాజకీయాల్లోకి వచ్చారు. విపక్ష పార్టీ ప్రైమరీ ఎన్నికల్లో 90 శాతం మెజార్టీ సాధించారు. 2024లో అధ్యక్ష ఎన్నికల్లో కూడా ఆమె నికోలస్ మదురోకు పోటీగా బరిలోకి దిగారు. కానీ తనపై ఉన్న కేసులు, ఇతర కారణాలు చూపించి అక్కడి ప్రభుత్వం ఆమెపై 15 ఏళ్ల పాటు అనర్హత వేటు వేసింది. ఆ దేశ సుప్రీంకోర్టు కూడా దీనికి మద్దతిచ్చింది. ఈ క్రమంలోనే ఆమె అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే ఛాన్స్ మిస్ అయ్యింది. 

Also Read: నోబెల్ బహుమతిలో అసలేముంటుంది? అన్ని విభాగాలకు ఒకేలా ఉంటుందా?

కొనసాగుతున్న పోరాటం

తనపై అనర్హత వేటు పడినప్పటికీ కూడా మరియా తన పోరాటాన్ని మాత్రం ఆపలేదు. ప్రజాస్వామ్య హక్కుల కోసం ప్రజల తరఫున డిమాండ్ చేస్తుండేవారు. నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టేవారు. ఈ ఏడాది జనవరిలో కూడా మరియాను భద్రతా బలగాలు అరెస్టు చేసినట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఆమెను విడుదల చేసినట్లు తెలిసింది. అప్పటినుంచి ఆమె ప్రజల పోరాటానికి సంబంధించిన ఆందోళనల్లో ఎక్కడా కనిపించలేదు. కానీ సోషల్ మీడియా వేదికగా మాత్రం ప్రజలను చైతన్యం పరుస్తూ పోరాడుతున్నారు. నిరాంతరాయంగా ప్రజల కోసం ఆమె చూపిన తెగువ, ధైర్య సాహసాలు ఎంతోమందికి స్పూర్తినిచ్చాయని నోబెల్ అకాడమని పేర్కొంది. ఈ క్రమంలోనే ఈ ఏడాది తనకు నోబెల్ శాంతి బహుమతి దక్కింది. 

Advertisment
తాజా కథనాలు