/rtv/media/media_files/2025/10/10/nobel-prize-2025-10-10-13-43-13.jpg)
Nobel Prize
ప్రపంచంలోనే అతి ప్రతిష్టాత్మకమైన నోబెల్ పురస్కారాలను(Nobel Prize 2025) వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వారికి అందజేస్తారు. అయితే డైనమైట్‌ను కనుగొన్న స్వీడన్‌కు చెందిన ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్‌ఫ్రెడ్ నోబెల్ జ్ఞాపకార్థంగా నోబెల్ పురస్కాలను ఇస్తారు. వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వారికి తన సంపద నుంచి వచ్చే ఆదాయంతో బహుమతులను ఇస్తారు. అయితే మొదటిగా ఈ పురస్కారాలను తొలిసారిగా 1901లో ప్రదానం చేశారు. ప్రతీ ఏడాది వీటిని ఆల్‌ఫ్రెడ్ నోబెల్ వర్ధంతి డిసెంబర్ 10న విజేతలకు బహూకరిస్తారు. అయితే ఈ పురస్కారాలను భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, వైద్య శాస్త్రం, సాహిత్యం, శాంతి, అర్థశాస్త్రం మొత్తం ఆరు రంగాల్లో ఇస్తున్నారు. ప్రతీ రంగంలో విశేష కృషి చేసిన వారికి ఈ అవార్డులను ప్రకటిస్తారు. ఈ నోబెల్ బహుమతి విజేతలకు ఒక బంగారు పతకం, ఒక పత్రం, నగదు పురస్కారం అందజేస్తారు. ఈ మూడు అంశాలు అన్ని రంగాల విజేతలకు ఇస్తారు. అయితే ప్రైజ్ మనీ అయితే ఒకేలా ఉంటుంది. కానీ పత్రం, బంగారు పతకంలో ఆయా రంగాల బట్టి మార్పులు ఉంటాయి.
Also Read : ఈ రంగాల వారికి బిగ్ షాక్.. హెచ్-1బీ వీసాల్లో మళ్లీ మార్పులు.. ఇక వెళ్లడం కష్టమే!
పతకంలో మార్పు
ఈ పతకాన్ని స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారంతో తయారు చేస్తారు. విజేతగా నిలిచిన వారికి పతకం ముందు భాగంలో ఆల్‌ఫ్రెడ్ నోబెల్ ముఖ చిత్రం తప్పకుండా ఉంటుంది. దాదాపుగా ఇది అన్ని రంగాల వారికి ఇదే పతకం ఉంటుంది. అయితే ఆయా అకాడమీలు ఇచ్చే దాన్ని బట్టి కొన్ని మార్పులు ఉంటాయి. పతకం వెనుక భాగంలో రంగాల వారీగా ప్రత్యేకమైన గుర్తులు లేదా కళాకృతులు ఉంటాయి. ప్రతి బహుమతిని ఇచ్చే అకాడమీ ఆ రంగానికి చెందిన ప్రత్యేక చిహ్నాన్ని పతకంపై చెక్కుతుంది. ఉదాహరణకు సాహిత్య పతకంపై ఒక ప్రత్యేక చిత్రం ఉంటే, భౌతిక శాస్త్ర పతకంపై సైన్స్ పురోగతిని సూచించే చిత్రం ఉంటుంది. శాంతి బహుమతి పతకం మాత్రం కొంచెం భిన్నంగా ఉంటుంది. ఇలా రంగాన్ని బట్టి పతకం వెనుక భాగంలో చిహ్నం ఉంటుంది. అయితే శాంతి బహుమతిపై ఆల్‌ఫ్రెడ్ నోబెల్ చిత్రం ఉండదు.. దీనికి బదులుగా నార్వేజియన్ నోబెల్ కమిటీ పేరు ఉంటుంది.
Also Read : ఏమీ చేయని వాళ్ళకు ఇచ్చారు..ఒబామాకు నోబెల్ రావడంపై ట్రంప్ అక్కసు
పత్రం
ప్రతీ విజేత చేసిన కృషిని వివరిస్తూ ఆ ప్రశంసా పత్రాన్ని రాస్తారు. కళాకారుల చేత ఎంతో ప్రత్యేకంగా చేతితో డిజైన్ చేస్తారు. అందువల్ల ప్రశంస పత్రం రూపకల్పన, దానిపై వాడే రంగులు, ఆర్ట్ వర్క్ ప్రతి విభాగానికి, ప్రతి విజేతకు ప్రత్యేకంగా ఉంటాయి.
నగదు పురస్కారం
ఆల్‌ఫ్రెడ్ నోబెల్ ఫౌండేషన్ ఆదాయం బట్టి ఉంటుంది. అన్ని రంగాల వారికి ఒకటే ప్రైజ్ మనీ ఉంటుంది. అయితే ఒకే రంగంలో ఇద్దరికీ లేదా ముగ్గురికి వస్తే ఆ ప్రైజ్ మనీని వారు సమానంగా పంచుకుంటారు.
ప్రదానం చేసే వేదికలు
నోబెల్ బహుమతులను ప్రదానం చేసే వేదికలు కూడా మారుతుంటాయి. నోబెల్ శాంతి బహుమతిను నార్వే దేశంలోని ఓస్లోలో ప్రదానం చేస్తారు. భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, వైద్య శాస్త్రం, సాహిత్యం, అర్థశాస్త్రం బహుమతులను స్వీడన్‌లోని స్టాక్‌హోమ్‌లో ప్రదానం చేస్తారు.
ప్రదానం చేస్తున్న అకాడమీలు
ఈ పురస్కారాలలో ఎక్కువ భాగం స్వీడన్‌లోని స్టాక్‌హోమ్ నుంచి ప్రదానం చేస్తారు. భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, అర్థశాస్త్రం విభాగాలలో నోబెల్ బహుమతిని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అందజేస్తుంది. ఈ మూడు రంగాలకు సంబంధించిన అవార్డుల ప్రదానం స్టాక్‌హోమ్‌లోనే జరుగుతుంది. వైద్య శాస్త్రం విభాగంలో అత్యుత్తమ కృషి చేసిన వారికి కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్ ఈ అవార్డును ఇస్తుంది. అలాగే సాహిత్యంలోని విశేష కృషి చేసిన విజేతలను స్వీడిష్ అకాడమీ ఎంపిక చేస్తుంది. ఈ రెండు విభాగాల పురస్కారాల ప్రదానం కూడా స్టాక్‌హోమ్‌లోనే జరుగుతుంది.