Cyber Attack: వామ్మో.. హ్యాకర్ల దెబ్బకు రోడ్డున పడ్డ 700 మంది ఉద్యోగాలు

యూకేలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. హ్యాకర్ల దెబ్బకు 158 ఏళ్లుగా కొనసాగుతున్న కంపెనీ మూతపడింది. దీంతో 700 మంది ఉద్యోగులు రోడ్డున పడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

New Update
Weak Password Triggers Collapse Of 158-Year-Old UK Company, 700 People Left Jobless

Weak Password Triggers Collapse Of 158-Year-Old UK Company, 700 People Left Jobless

Cyber Attack:

యూకేలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. హ్యాకర్ల(Hackers) దెబ్బకు 158 ఏళ్లుగా కొనసాగుతున్న కంపెనీ మూతపడింది. దీంతో 700 మంది ఉద్యోగులు రోడ్డున పడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. యూకేలోని కేఎన్‌పీ లాజిస్టిక్స్‌ అనే కంపెనీ గత 158 ఏళ్ల నుంచి రవాణా రంగంలో వ్యాపారం చేస్తోంది. ఈ సంస్థకు దాదాపు 500 లారీలు ఉన్నాయి. వీటిని  ‘ది నైట్స్‌ ఆఫ్‌ ఓల్డ్‌’ అనే బ్రాండ్‌ కింద నడుపుతోంది. ఇది ఇండస్ట్రీకి సంబంధించిన రూల్స్‌ను కూడా కచ్చితంగా పాటిస్తుంది. అలాగే సైబర్ అటాక్ బీమా కూడా తీసుకుంది.

Also Read: 224 మంది పోలీసులు మిస్సింగ్.. హోంశాఖలో కలకలం..

అయినప్పటికీ కూడా అకిర గ్యాంగ్ హ్యాకర్ల రాన్సమ్‌వేర్‌ సైబర్ అటాక్‌కు గురైంది. ఈ ముఠా కేఎన్‌పీ సిస్ట్‌మ్స్‌లోని అనధికారికంగా ప్రవేశించింది. అక్కడ ఆ కంపెనీ డేటాను ఎన్‌క్రిప్ట్‌ ఫార్మాట్‌లోకి మార్చింది. ఉద్యోగులకు దాని యాక్సెస్‌ లేకుండా చేసింది. మళ్లీ తిరిగి డేటాను పొందాలంటే కొత్త మొత్తం చెల్లించాలంటూ డిమాండ్ చేసింది. అయితే ఎంత చెల్లించాలనేది మాత్రం చెప్పలేదు. పలువురు నిపుణులు.. దాదాపు 5 మిలియన్ పౌండ్లు (రూ.58 కోట్లు) అడిగి ఉండొచ్చని చెబుతున్నారు.

Also Read: ఆస్పత్రిలో గ్యాంగ్‌స్టర్‌ హత్య కేసు.. ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు అనుమానితులకు గాయాలు

కేఎన్‌పీ అంత సొమ్ము చెల్లించలేని స్థితిలో ఉండటంతో డేటా మొత్తం కోల్పోయింది. చివరికీ కంపెనీ పూర్తిగా మూతబడింది. గతంలో కూడా యూకేకు చెందిన కోఆప్, హారోడ్స్, ఎం అండ్ ఎస్‌ కూడా ఇలాంటి సైబర్ దాడులకే గురయ్యాయి. కోఆప్‌లో ఏకంగా 65 లక్షల మంది డేటాను అపహరించారు. అయితే తాజాగా KNP కంపెనీకి జరిగిన ఘటనపై నేషనల్ సైబర్ సెక్యూరిటీ సెంటర్ సీఈవో రీచర్డ్ హోర్నే స్పందించారు. మన వ్యాపారాలు సురక్షితంగా ఉండాలంటే సిస్టమ్స్‌ను మరింత సురక్షితంగా మార్చే ఆర్గనైజేషన్లు కావాలన్నారు. అలాగే కంపెనీలో ఉద్యోగుల లాగిన్ పాస్‌వర్డ్‌ల ద్వారానే హ్యాకర్లు సిస్టమ్స్‌లోకి ప్రవేశించారని KNP డైరెక్టర్ పౌల్ అబాట్ అన్నారు. 

Also Read:Pawan Kalyan: ప్లాపుల్లో నా కోసం నిలబడిన మిత్రుడు త్రివిక్రమ్.. పవన్ ఎమోషనల్ కామెంట్స్!

Also Read: Avatar Fire and Ash: అవతార్: ఫైర్ అండ్ ఆష్ బిగ్ అప్డేట్.. ఈ ట్విస్ట్ మాములుగా లేదుగా..!

Advertisment
తాజా కథనాలు