Policemen Missing: 224 మంది పోలీసులు మిస్సింగ్.. హోంశాఖలో కలకలం..

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌ కమిషనరేట్‌లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. దాదాపు 224 మంది పోలీసులు అక్కడి నుంచి అదృశ్యమవ్వడం కలకలం రేపుతోంది. గత ఆరు నెలలుగా ఆ పోలీసులు విధులకు హాజరు కావడం లేదు.

New Update
Policemen

Policemen

Policemen Missing:

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌ కమిషనరేట్‌లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. దాదాపు 224 మంది పోలీసులు అక్కడి నుంచి అదృశ్యమవ్వడం కలకలం రేపుతోంది. గత ఆరు నెలలుగా ఆ పోలీసులు విధులకు హాజరు కావడం లేదు. వాళ్ల ఆచూకీ కూడా తెలియడం లేదు.  ఓ వార్తా సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. కాన్పూర్‌ కమిషనరేట్‌లో పనిచేస్తున్న 224 మంది పోలీసులు అదృశ్యమయ్యారు. ఈ పోలీసులు వారి సొంత జిల్లాలో గానీ వాళ్ల ఇళ్లలో గానీ లేరు. వారి మొబైల్ ఫోన్‌లు కూడా స్విచ్‌ఆఫ్‌ అయిపోయాయి. ప్రస్తుతం వాళ్ల ఆచూకి ఎక్కడుందో తెలియదు. 

Also Read: ఆ 3 గంటల్లో అసలేం జరిగింది.. ధన్‌ఖడ్‌ రాజీనామాకు బలమైన కారణం అదేనా?

ఈ కేసులో పోలీస్ యంత్రాంగం వాళ్లకి రెండుసార్లు నోటీసులు పంపించింది. కానీ ఇప్పటిదాకా ఎలాంటి సమాధానం రాలేదు. అందుకే పెద్ద సంఖ్యలో పోలీసలు తప్పిపోయినట్లు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీనిపై సీనియర్ అధికారులు ఉత్తర్‌ప్రదేశ్‌ పోలీసు ప్రధాన కార్యాలయానికి కూడా సమాచారం అందించారు. అయితే తప్పిపోయిన 224 మందిలో 109 మంది కానిస్టేబుళ్లు, 57 మంది మహిళా కానిస్టేబుళ్లు, 34 మంది ఇన్‌స్పెక్టర్లు, 24 మంది మహిళా ఇన్‌స్పెక్టర్లు ఉన్నారు.

వీళ్లలో కొందరు వైద్య సెలవులపై వెళ్లగా.. మరికొందరు వివహం పేరుతో సెలవులు తీసుకున్నారు. ప్రస్తుతం దీనిపై పోలీస్ ఉన్నతాధికారులు దర్యాప్తు చేస్తున్నారు. వీళ్లు ఎందుకు విధులకు తిరిగి రాలేకపోయారు ? వీళ్ల ఆచూకి ఎక్కడా అనే దానిపై విచారణ జరుపుతున్నారు. యూపీ హోంశాఖలో ఇలా 224 మంది పోలీసులు అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. 

Also Read: ఆస్పత్రిలో గ్యాంగ్‌స్టర్‌ హత్య కేసు.. ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు అనుమానితులకు గాయాలు

Advertisment
తాజా కథనాలు