Pawan Kalyan: ప్లాపుల్లో నా కోసం నిలబడిన మిత్రుడు త్రివిక్రమ్.. పవన్ ఎమోషనల్ కామెంట్స్!

'హరిహర వీరమల్లు' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ మరోసారి త్రివిక్రమ్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. తన సినిమా కెరీర్‌లో ఒకానొక సమయంలో వరుస పరాపజయాలతో సతమతమవుతున్నప్పుడు త్రివిక్రమ్ తిరిగి నిలబడడానికి అండగా నిలిచారని తెలిపారు. 

New Update

Pawan Kalyan: పవన్ కళ్యాణ్- త్రివిక్రమ్ మధ్య మంచి స్నేహితులు అనే విషయం అందరికీ తెలుసు. వీరిద్దరిది కేవలం వృత్తిపరమైన సంబంధం మాత్రమే కాదు వ్యక్తిగత జీవితంలో ఒకరికొకరు ఎంతో సపోర్టివ్ గా ఉంటూ తమ స్నేహ బంధాన్ని చాటుకుంటారు. తాజాగా 'హరిహర వీరమల్లు' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ మరోసారి త్రివిక్రమ్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. తన సినిమా కెరీర్‌లో ఒకానొక సమయంలో వరుస పరాపజయాలతో సతమతమవుతున్నప్పుడు త్రివిక్రమ్ తిరిగి నిలబడడానికి అండగా నిలిచారని తెలిపారు. 

నా నిజమైన మిత్రుడు

పవన్ మాట్లాడుతూ.. ''నేను పదేళ్ల పాటు ప్లాపుల్లో ఉన్నాను. వరుస హిట్లు కొడుతున్న సమయంలో ఒక ప్లాప్ మూవీ చేసి పాపం చేశాను! ఆ తర్వాత సినిమాలపై పట్టు కోల్పోయాను. సరైన స్క్రిప్ట్స్  ఎంచుకోవడానికి తడబడుతున్న సమయంలో.. త్రివిక్రమ్ 'జల్సా' తో నా  జీవితంలోకి వచ్చాడు. 'జల్సా' తో పెద్ద హిట్ ఇచ్చి తిరిగి నన్ను నిలబెట్టాడు. అప్పటివరకు త్రివిక్రమ్ ఎవరో కూడా నాకు తెలియదు. కానీ మేమిద్దరం కలిసి సినిమా చేశాము! సక్సెస్ లో ఉన్నప్పుడు ఎవరైనా వెతుక్కుంటూ వస్తారు. కానీ అపజయాల్లో నన్ను వెతుక్కుంటూ వచ్చిన నా మిత్రుడు, ఆత్మబంధువు త్రివిక్రమ్ శ్రీనివాస్!  కష్టాల్లో నాకు భగవంతుడు ఇచ్చిన స్నేహితుడు త్రివిక్రమ్ అని ఎమోషనల్ గా చెప్పారు పవన్. 

త్రివిక్రమ్- పవన్ కళ్యాణ్ స్నేహం కేవలం సినిమాలు తీయడం వరకు మాత్రమే పరిమితం కాలేదు. పవన్ రాజకీయ ప్రయాణానికి కూడా త్రివిక్రమ్ సపోర్ట్ గా ఉన్నారు. ఆయన పలు రాజకీయ సమావేశాలకు త్రివిక్రమ్ కూడా హాజరుకావడం, పవన్ ఆలోచనలకు తన మాటలతో ప్రాణం పోయడం వంటివి వారి బలమైన స్నేహా బంధానికి ప్రతీకగా కనిపిస్తాయి. 

Also Read:Duvvada Srinivas – Maduri: దువ్వాడ జంట రొమాంటిక్ ప్రీవెడ్డింగ్ షూట్.. వీడియో చూస్తే పిచ్చెక్కిపోతారు..!

Advertisment
తాజా కథనాలు