Aliens: రష్యాలో నాయకుడిని ఎలియన్స్ కిడ్నాప్.. వైరల్ వీడియో

రష్యా మాజీ రాజకీయ నాయకుడు, అంతర్జాతీయ చెస్ సంస్థ FIDE మాజీ అధ్యక్షుడు అయిన కిర్సన్ ఇల్యూమ్జినోవ్ ఇచ్చిన పాత ఇంటర్వ్యూ క్లిప్ మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ చర్చకు దారితీసింది. 1997లో తనను ఏలియన్స్ డి ఆయన పదేపదే చేసిన వాదనలు ఈ క్లిప్‌లో ఉన్నాయి.

New Update
Screenshot 2025-12-16 113536

రష్యాకు చెందిన ఓ మాజీ రాజకీయ నాయకుడు(Russian leader), అంతర్జాతీయ చెస్ సంస్థ FIDE మాజీ అధ్యక్షుడు అయిన కిర్సన్ ఇల్యూమ్జినోవ్ ఇచ్చిన పాత ఇంటర్వ్యూ క్లిప్ మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ చర్చకు దారితీసింది. 1997లో తనను ఏలియన్స్ డి ఆయన పదేపదే చేసిన వాదనలు ఈ క్లిప్‌లో ఉన్నాయి. కిర్సన్ ఇల్యూమ్జినోవ్(Kirsan Ilyumzhinov) రష్యాలోని కల్మికియా రిపబ్లిక్ మాజీ అధ్యక్షుడిగా 17 ఏళ్లకు పైగా పనిచేశారు. 2010లో ఇచ్చిన ఒక టీవీ ఇంటర్వ్యూలో ఆయన ఈ సంచలన విషయాలను మొదటిసారిగా వెల్లడించారు. తాజాగా ఓ అమెరికన్ పాడ్‌కాస్ట్‌లో దీని గురించి మళ్లీ మాట్లాడడంతో ఆ క్లిప్ విస్తృతంగా షేర్ అవుతోంది. - aliens-on-earth

Also Read :  రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో బిగ్ ట్విస్ట్.. తొలిసారిగా అండర్‌ వాటర్ డ్రోన్లు

Russian Leader Clip Goes Viral

Also Read :  ఢిల్లీని ఆక్రమిస్తాం.. పాక్‌ ఉగ్రవాది సంచలన వ్యాఖ్యలు

1997 సెప్టెంబరులో తన మాస్కో అపార్ట్‌మెంట్ బాల్కనీ నుండి తనను గ్రహాంతరవాసులు అంతరిక్ష నౌకలోకి తీసుకువెళ్లారని ఆయన పేర్కొన్నారు. వారు పసుపు రంగు స్పేస్‌సూట్‌లు ధరించి ఉన్నారని, మానవ రూపంలో సుమారు రెండు మీటర్ల పొడవు ఉన్నారని ఇల్యూమ్జినోవ్ వివరించారు. గ్రహాంతరవాసులు తమతో టెలిపతిలో మాట్లాడారని, తాము మనుషుల కంటే వేరే కోణంలో జీవిస్తున్నామని, చెస్ ఆటను కూడా తామే కనిపెట్టామని చెప్పారని ఆయన తెలిపారు.

తాము ఈ గ్రహంపై శాంతియుత పరిశీలకులమని, మానవ నాగరికత ఇంకా ప్రారంభ దశలోనే ఉందని గ్రహాంతరవాసులు చెప్పారని ఇల్యూమ్జినోవ్ పేర్కొన్నారు. ఆయన ఈ వాదనలను రష్యాలో చాలా మంది అప్పట్లో నవ్వుతూ కొట్టిపారేసినప్పటికీ, సోషల్ మీడియాలో మాత్రం ఈ వింత కథనం పట్ల ఇప్పటికీ ఆసక్తి కొనసాగుతోంది.

Advertisment
తాజా కథనాలు