/rtv/media/media_files/2025/12/14/pakistan-2025-12-14-15-45-13.jpg)
Pakistan
పాక్(pakistan) ఉగ్రవాద సంస్థ లష్కరే తయ్యిబా(lashkar-e-taiba) మరోసారి రెచ్చిపోయింది. భారత్‌ను ఉద్దేశిస్తూ ఆ ఉగ్రసంస్థకు చెందిన నేత ఢిల్లీని ఆక్రమిస్తామని అర్థమచ్చేలా వ్యాఖ్యానించాడు. ఆ నగరాన్ని పెళ్లికూతురుగా తయారుచేస్తామంటూ పేర్కొన్నాడు. ఈ క్రమంలోనే భారత వైమానిక దళంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఇక వివరాల్లోకి వెళ్తే.. లష్కరే తయ్యిబా ఫౌండర్ హఫీజ్ సయీద్‌కు అత్యంత సన్నిహితుడైన అబ్దుల్ రవూఫ్‌ను పాకిస్థాన్ ఆర్మీ సాధారణ పౌరుడిగా ప్రకటించింది.
Also Read: ‘తీహార్’తరలిపోతోంది..ఎక్కడికో తెలుసా?
Pakistan Based Lashkar Terrorist Remarks
భారత్‌పై దాడులకు సంబంధించి అతడు చేసిన వివాదాస్పద వ్యాఖ్యల్లో ఉగ్రభావజాలం ఉన్నట్లు తేలింది. తాజాగా చేసిన ప్రసంగంలో అబ్దుల్ రవూఫ్ మాట్లాడుతూ జమ్మూకశ్మీర్‌లో సాయుధపోరాటం ముగిసిపోయిందనే వాదనలను కొట్టిపారేశాడు. వివాదం మళ్లీ తీవ్రతరమవుతుందంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఎల్‌ఐటీ కో-ఫౌండర్ అబ్దుల్ రెహమాన్ మక్కీని ఉద్దేశిస్తూ మాట్లాడాడు. రాజధానిని (ఢిల్లీని ఉద్దేశిస్తూ) స్వాధీనం చేసుకోవడమే తమ గ్రూప్ టార్గెట్ అన్నాడు. ఢిల్లీని ఆక్రమిస్తాంటూ వ్యాఖ్యానించాడు.
Also Read: కమ్యూనిస్టుల కంచు కోట బద్దలు.. కేరళ లోకల్ ఎలక్షన్స్ లో దుమ్ములేపిన BJP
ఇదిలాఉండగా ఇండియన్ ఆర్మీపై కూడా రవూఫ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. రఫేల్ యుద్ధ విమానాలు, S-400 గగనతల రక్షణ వ్యవస్థలు, డ్రోన్‌లు అసమర్థమైనవిగా పేర్కొన్నాడు. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ పాకిస్థాన్ గగనతలంలోకి వచ్చే ధైర్యం చేయదన్నారు. ఇస్లామిక్ దేశాల్లో పాకిస్థాన్‌కు మత్రమే అసలైన అణ్వాయుధాలు ఉన్నట్లు పేర్కొన్నారు.
Follow Us