Musk-Vance: మస్క్‌-వాన్స్‌ కి పొసగడం లేదా..నిజమేంటంటే!

అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్‌ మాట్లాడినట్లు ఓ ఆడియో వైరల్‌ అవుతుంది.అందులో మస్క్ అమెరికా వ్యక్తి కాదని, ప్రభుత్వం విషయంలో అనవసరంగా జోక్యం చేసుకుంటున్నాడని వాన్స్‌ అన్నట్లు ఉంది. కానీ అది ఏఐ సృష్టించిన ఆడియో అని వాన్స్‌ దానిని కొట్టిపారేశారు.

New Update
vance

vance

ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత, ట్రంప్ సలహాదారుడు ఎలోన్ మస్క్-అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మధ్య పొసగడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. ఇద్దరి మధ్య వైర్యం నడుస్తున్నట్లుగా సోషల్ మీడియాలో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఇందుకు జేడీ వాన్స్‌కు సంబంధించిన ఆడియో ఒకటి వైరల్ అవుతోంది. అందులో మస్క్‌ తీరును తీవ్రంగా తప్పుపట్టినట్లుగా కనిపిస్తోంది.మస్క్ అమెరికన్ కాదని.. దక్షిణాఫ్రికాకు చెందిన వ్యక్తి అని.. అమెరికన్‌గా వేషధారణ కలిగి ఉన్నాడంటూ జేడీ వాన్స్‌కు సంబంధించిన ఓ ఆడియో క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

Also Read: South Korea: సౌత్‌ కొరియాలో కార్చిచ్చు బీభత్సం..19 మంది మృతి!

దీంతో ఇద్దరికీ పొసగడం లేదంటూ ఓ యాక్టివిస్ట్ సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.ఆడియో క్లిప్‌ వైరల్‌గా మారడంతో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్పందించారు. ఆడియో రికార్డ్‌ను తోసిపుచ్చారు. అది ఏఐ సృష్టించిన ఆడియో అంటూ కొట్టిపారేశారు. ట్వీట్ చేసిన వ్యక్తికి ఏఐ ద్వారా సృష్టింపబడిన కంటెంట్ అని అర్థం చేసుకునేంత తెలివితేటలు లేవా? అంటూ ప్రశ్నించారు. అది నకిలీదని తెలిసిన తర్వాతైనా దానిని తొలగిస్తే మంచిది.. లేదంటే అది పరువు నష్టం దావా కిందకు వస్తుందని పోస్టు చేసిన వ్యక్తికి వాన్స్ ఓ రేంజ్‌ లో వార్నింగ్ ఇచ్చారు. ఇక ఈ ఆడియోపై మస్క్ ఇప్పటి వరకు స్పందించలేదు. ఆయన వెర్షన్ ఎలా ఉంటుందో చూడాలి.

Also Read: Sonu Nigam:ప్రముఖ సింగర్‌ సోనూ నిగ‌మ్‌ పై  రాళ్లు, సీసాల‌తో దాడి..!

అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక పాలనలో ఎలోన్ మస్క్ పెత్తనం ఎక్కువైపోయింది. ఎప్పుడు చూసినా మస్క్.. ట్రంప్ వెంటే ఉంటున్నారు. ప్రస్తుతం ట్రంప్ సలహాదారుడిగా మస్క్ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మస్క్.. పాలనలో జోక్యం అధికమైనట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా మస్క్‌పై ప్రభుత్వోద్యోగులు కూడా గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మస్క్‌కు సంబంధించిన ఆస్తులపై దాడులు జరిగినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

Also Read: America:యూఎస్‌ హెల్త్‌ ఏజెన్సీకి అధిపతిగా భారత సంతతి వ్యక్తి నియామకం!

Also Read: Suryapet Murder: సూర్యాపేటలో మాజీ సర్పంచ్ మర్డర్.. డీఎస్పీతో పాటు ఆ పోలీసులందరిపై వేటు!

 jd-vance | trump | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు