/rtv/media/media_files/2024/10/23/wyhituvXEJHVfTZ283p7.jpg)
China: చైనాకు భారత్ పొరుగు దేశం. ఒకే సరిహద్దును పంచుకుంటున్న ఆసియా దేశాలు. కానీ ఆ దేశం ఎప్పుడు ఇండియా మీద కాలుదువ్వుతూనే ఉంటుంది. మన దేశంలో ప్రదేశాలను ఆక్రమించుకోడానిక, దాడి చేయడానికి అదను చూస్తూనే ఉటుది. ఎవరు ఎంత చెప్పినా వినలేదు. కానీ ఇప్పుడు మాత్రం భారత్ తో సమా పొరుగు దేశాతో వ్యాహాత్మక సంబంధలను పెంపొందించుకొంటామని అంటున్నారు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్. దీనికి కారణం అమెరికా కొట్టిన సుంకాల దెబ్బ. మిగతా ఏ దేశాలకు లేని విధంగా అత్యధిక టారీఫ్ లను చైనాపై విధించారు ట్రంప్. ఏకంగా 125 శాతం టారీఫ్ లతో విరుచుకుపడ్డారు. చైనా కూడా అమెరికా ధీటుగా జవాబిస్తోంది కానీ ఎక్కువ కాలం నిలబడలేకపోవచ్చును. ఇప్పుడు ఆ దేశానికి మిగతా దేశాల సపోర్ట్ చాలా అవసరం. అందులో భాగ్గానే జిన్ పింగ్ స్నేహం కావాలి అంటూ చిలక పలుకులు పలుకుతున్నారు.
Also Read: Ram Charan Peddi AI Video: ఏం క్రియేటివిటీ రా బాబు..! వైరల్ అవుతున్న రామ్ చరణ్ AI వీడియో
ఉమ్మడి లక్ష్యం కోసం కలిసి పని చేస్తాం..
తమ మధ్య అభిప్రాయ భేదాలు తగ్గించుకుని సరఫరా వ్యవస్థలను మరింత పెంపొందించుకునేదుకు ప్రయత్నిస్తామని చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ చెబుతున్నారు. పొరుగు దేశాలు ముఖ్యంగా భారత్ తో కలిసి పని చేస్తామని.. ఒక మంచి ఉమ్మడి సమాజాన్ని నిర్మిస్తామని అంటున్నారు. బీజింగ్‌లో మంగళ, బుధవారాల్లో రెండు రోజులపాటు జరిగిన ఉన్నతస్థాయి కేంద్ర కమిటీ సమావేశంలో జిన్‌పింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. చైనా ప్రధాని లీ కియాంగ్ కూడా దీనికి వత్తాసు పలికారు. అధ్యక్షుడు చెప్పినట్టుగా పొరుగు దేశాలతో వ్యవహారం అమలులో పెట్టాలని అన్నారు. ఇందులో భాగంగా జిన్‌పింగ్ త్వరలో కీలక పొరుగు దేశాలైన వియత్నాం, మలేసియా, కాంబోడియాలలో సందర్శించే అవకాశముంది.
Also Read:Allu Arjun - Pavan Kalyan Son: సింగపూర్‌కు అల్లు అర్జున్.. పవన్ కొడుకు కోసం పయణం!
today-latest-news-in-telugu | china | india | usa | trump tariffs