Allu Arjun - Pavan Kalyan Son: సింగపూర్‌కు అల్లు అర్జున్.. పవన్ కొడుకు కోసం పయణం!

పవన్ కళ్యాన్ కుమారుడు మార్క్ శంకర్‌ను పరామర్శించేందుకు అల్లు అర్జున్ సింగపూర్ బయల్దేరనున్నాడు. మరో రెండు, మూడు రోజుల్లో బన్నీ సింగపూర్‌కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న మార్క్‌ శంకర్‌ను పరామర్శించే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.

New Update
Allu Arjun to visit Pawan Kalyan's son Mark Shankar in hospital

Allu Arjun to visit Pawan Kalyan's son Mark Shankar in hospital

సింగపూర్‌లో ఓ సమ్మర్ క్యాంప్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ అగ్నిప్రమాదంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనయుడు మార్క్ శంకర్ పవనోవిచ్ తీవ్రంగా గాయపడ్డాడు. మార్క్ శంకర్ కాళ్లూ, చేతులకు గాయాలయ్యాయి. అలాగే అతడి ఊపిరితిత్తులలోకి పొగ చేరింది. దీంతో మార్క్ శంకర్‌కు ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. పవన్ కళ్యాణ్, చిరంజీవి దంపతులు కూడా ఇప్పటికే సింగపూర్ చేరుకున్నారు. మరో మూడు రోజులు మార్క్ శంకర్‌ను ఆస్పత్రిలో ఉంచనున్నట్లు తెలిసింది. 

Also Read: మీరు ఐస్ క్రీమ్‌ ఎక్కువగా తింటారా..అయితే 3 లక్షలు మీ సొంతం!

సింగపూర్‌కు అల్లు అర్జున్

ఈ క్రమంలో మరో రెండు, మూడు రోజుల్లో అల్లు అర్జున్ సింగపూర్‌కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న మార్క్‌ శంకర్‌ను పరామర్శించేందుకు అక్కడికి వెళ్లే అవకాశం ఉందని సమాచారం అందింది. హాస్పిటల్‌కు చేరుకుని మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడానికి సింగపూర్ వెళ్లనున్నట్లు టాక్ నడుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో. 

Also read: పసిబిడ్డల ఉసురు తీస్తున్న అక్రమ సంబంధాలు.. ఈ ఏడాది ఎంతమందిని చంపేశారంటే!

మార్క్ శంకర్ హెల్త్ అప్డేట్

ఇదిలా ఉంటే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ ఆరోగ్యంపై పవన్ టీం హెల్త్ అప్‌డేట్ విడుదల చేసింది. ప్రస్తుతం మార్క్ శంకర్ సింగపూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పవన్ కళ్యాణ్, చిరంజీవి కుటుంబం కూడా మంగళవారం రాత్రి సింగపూర్ వెళ్లారు. అగ్ని ప్రమాదంలో గాయపడిన మార్క్ శంకర్ ప్రస్తుతం కోలుకుంటున్నారు. 

Also read: వాళ్లను తరిమికొట్టినట్లే.. బీజేపీ వాళ్లను ఓడించాలి : సీఎం రేవంత్ రెడ్డి

మార్క్ శంకర్‌ను ఎమర్జెన్సీ వార్డు నుంచి బయటకు మార్చినట్లు పవన్ కళ్యాణ్ టీమ్ వెల్లడించింది. ఈ మేరకు ఓ ప్రెస్‌నోట్ విడుదల చేసింది. మార్క్ శంకర్ ప్రస్తుతం సింగపూర్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారనీ.. పవన్ కళ్యాణ్ మంగళవారం రాత్రి హైదరాబాద్ నుంచి సింగపూర్‌ చేరుకుని నేరుగా ఆస్పత్రికి వచ్చినట్లు తెలిపింది. 

(pavan kalyan son | pawan kalyan son mark shankar | pawan son mark shankar school incident | latest-telugu-news | telugu-news)

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు