/rtv/media/media_files/2025/04/09/JGmr76BGkl1mX4LsD4n8.jpg)
Ram Charan Peddi AI Video
Ram Charan Peddi AI Video: రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో రూపొందుతున్న చిత్రం ‘పెద్ది’ ఫస్ట్ షాట్ గ్లింప్స్ కి సూపర్ డూపర్ రెస్పాన్స్ వచ్చింది. జాన్వీకపూర్ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్నారు. ఉత్తరాంధ్ర యాసలో రామ్ చరణ్ చెప్పిన డైలాగులు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అయితే ఈ గ్లింప్స్ లో రామ్ చరణ్ చెప్పిన ఓ డైలాగును చరణ్ ఓ ఇంటర్వ్యూలో లైవ్ లో చెప్తున్నట్టుగా AI సాయంతో రీ క్రియేట్ చేసారు ఫ్యాన్స్. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Also Read: ‘అదిదా సర్‌ప్రైజ్’ ఫుల్ వీడియో సాంగ్.. సైలెంట్‌గా స్టెప్ లేపేసారుగా..!
ఏం క్రియేటివిటీ రా బాబు..!
రామ్ చరణ్ ‘పెద్ది’ ఫస్ట్ షాట్ గ్లింప్స్ లో చెప్పిన "ఒకే పని సెసేనాకి... ఒకే లాగా బతికేనాకి... ఇంతపెద్ద బతుకెందుకు? ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే సేసెయ్యాల... పుడతామా యేటి మళ్లీ!" అనే డైలాగును చరణ్ రియల్ గా చెప్పినట్టుగా AI తో రీ క్రియేట్ చేసారు ఫ్యాన్స్ దీంతో చాలా మంది ఈ వీడియోలో నిజంగా చరణ్ మాట్లాడినట్టుగా అనుకుంటూ ఆశ్చర్యపోతున్నారు.
అయితే ఈ సినిమా క్రికెట్ నేపథ్యంలో ఉంటుందని సమాచారం. బ్యాట్ పట్టుకుని, ఉత్తరాంధ్ర యాసలో రామ్ చరణ్ చాలా మాస్ లుక్ లో కనిపించారు. ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతోంది. ‘పెద్ది’కి ఆర్.ఆర్. రెహమాన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది మార్చి 27న విడుదల కాబోతోంది.
Also Read: NTR: ధైర్యంగా ఉండు లిటిల్ వారియర్.. పవన్ కొడుకు కోసం ఎన్టీఆర్ ట్వీట్
Also Read: Kangana Ranaut: కంగనా ఇంటికి లక్ష రూపాయల కరెంట్ బిల్లు.. కాంగ్రెస్ ప్రభుత్వంపై నటి విమర్శలు!
AI Mass 🔥🔥#PEDDI pic.twitter.com/KOK3QOzAUW
— Mr© 🔥 (@CharanTheLEO) April 8, 2025