Trump: ట్రంప్ బిగ్‌ షాక్‌.. డయాబెటీస్, ఒబెసిటి ఉంటే అమెరికాకు నో ఎంట్రీ

తాజాగా ట్రంప్ సర్కార్‌ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి డయాబెటీస్, ఒబెసిటి లాంటి వ్యాధులతో బాధపడేవారు అమెరికాకు వెళ్లలేరు. వీళ్లు వీసాకు దరఖాస్తు చేసుకుంటే తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంటుంది.

New Update
US' new rules say your visa could be denied if you suffer from chronic diseases like diabetes, obesity

US' new rules say your visa could be denied if you suffer from chronic diseases like diabetes, obesity

అమెరికా వెళ్లాలని చాలామందికి ఓ కళ. అక్కడే ఉద్యోగం చేసుకుంటూ స్థిరపడిపోవాలనుకుంటారు. కానీ ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అక్కడికి వెళ్లడం చాలా కష్టంగా మారిపోయింది. ఇటీవల అక్కడి ప్రభుత్వం హెచ్‌1బీ వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచిన సంగతి తెలిసిందే. తాజాగా ట్రంప్ సర్కార్‌ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి డయాబెటీస్, ఒబెసిటి లాంటి వ్యాధులతో బాధపడేవారు అమెరికాకు వెళ్లలేరు. వీళ్లు వీసాకు దరఖాస్తు చేసుకుంటే తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి తాజాగా ట్రంప్ యంత్రాంగం మార్గదర్శకాలు విడుదల చేసింది. 

Also Read: టెస్లాలో మస్క్ కు వన్ ట్రిలియన్ ప్యాకేజ్..ఆనందంతో రోబోతో ఎలాన్ డాన్స్

అమెరికాలో పబ్లిక్ ఛార్జ్ అనే రూల్‌ ఎప్పటినుంచో కొనసాగుతోంది. దీని ప్రకారం అనారోగ్యంతో ఉన్న వ్యక్తి అక్కడి ప్రభుత్వ నిధులపై లేదా ప్రజా వ్యయంపై ఆధారపడవచ్చు. అయితే తాజాగా ట్రంప్‌ జారీ చేసిన కొత్త నిబంధనల ప్రకారం వీసా అధికారులు .. దరఖాస్తుదారుల ఆరోగ్యం, వయస్సు గురించి పరిశీలిస్తారు. భవిష్యత్తులో వీళ్లు తమ సొంత డబ్బుతో వైద్య ఖర్చులు భరించగలరా లేదా ప్రభుత్వ నిధులపై ఆధారపడాల్సి వస్తుందా అనేది పర్యవేక్షిస్తారు.

Also Read: ప్రపంచాన్ని 150 సార్లు  పేల్చేయగలం : అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు

 దీన్నిబట్టి దరఖాస్తుదారులకు వీసా జారీ చేయాలా ? వద్దా ? అనేది నిర్ణయం తీసుకుంటారు. విదేశాల నుంచి వచ్చే వాళ్లలో డయాబెటీస్, ఒబెసిటి లాంటి వ్యాధులతో బాధపడేవారికి అమెరికా ప్రభుత్వ నిధులు అందించడం వల్ల అక్కడి ప్రభుత్వానికి ఆర్థిక భారమమవుతోంది. ఈ క్రమంలోనే తాజాగా దీన్ని నియంత్రించేందుకు ట్రంప్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

Also Read: నర్స్ ఘోరం: పని భారం తగ్గించుకోవడానికి 10 మంది రోగులను చంపేశాడు!

Advertisment
తాజా కథనాలు