Donald Trump : ప్రపంచాన్ని 150 సార్లు  పేల్చేయగలం : అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు

రష్యా, చైనా వద్ద పెద్ద మొత్తంలో అణ్వాయుధాలు ఉన్నాయని అంటారు. కానీ మావద్ద వాటికంటే ఎక్కువ ఉన్నాయి. మా వద్ద ఉన్న అణ్వాయుధాలతో ఈ భూమిని 150 సార్లు పేల్చేయగలం అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.

New Update
Donald Trump

Donald Trump

Donald Trump : రష్యా, చైనా వద్ద పెద్ద మొత్తంలో అణ్వాయుధాలు ఉన్నాయని అంటారు. కానీ మావద్ద వాటికంటే ఎక్కువ ఉన్నాయి. మా వద్ద ఉన్న అణ్వాయుధాలతో ఈ భూమిని 150 సార్లు పేల్చేయగలం అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. మియామీలో జరిగిన అమెరికన్‌ బిజినెస్‌ ఫోరమ్‌ సదస్సులో పాల్గొన్నఆయన మాట్లాడుతూ అణు నిరాయుధీకరణ గొప్ప విషయమని వ్యాఖ్యనించారు.

మూడు దశాబ్దాల విరామం తర్వాత అమెరికా అణ్వాయుధ పరీక్షలను తిరిగి ప్రారంభించింది. ఈ నిర్ణయంతో ప్రపంచవ్యాప్తంగా రాజకీయ ఉద్రిక్తతలు మళ్లీ చెలరేగాయి. ట్రంప్‌ ఈ చర్యను సమర్థిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ అంశంపై రష్యా అధ్యక్షుడు పుతిన్‌, చైనా అధినేత జిన్‌పింగ్‌తో చర్చించినట్లు వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో చాలా దేశాలు ఇప్పటికే అణు పరీక్షలను నిర్వహిస్తున్నాయన్నారు. రష్యా, చైనా, ఉత్తరకొరియా, పాకిస్థాన్‌ లాంటి దేశాలు నిరంతరం అణు సామర్థ్యాలను పరీక్షిస్తున్నాయి. కానీ అవి ఈ విషయాన్ని బహిరంగంగా చెప్పడం లేదన్నారు.మేము మాత్రం ఎప్పుడూ పారదర్శకంగా ఉంటాం. ఎవరూ మాట్లాడనిది మేము బహిరంగంగా చేస్తామని ట్రంప్‌ పేర్కొన్నారు.

'ఇన్నాళ్లూ మేము ఓర్పుతో ఉన్నాం. ఇతర దేశాలు అణ్వాయుధ పరీక్షలు చేసినా వాటిని పట్టించుకోలేదు. కానీ ఇకపై అలా మౌనంగా ఉండే ఉద్దేశం లేదు. ప్రపంచానికి సమానంగా మేమూ అణు పరీక్షలు చేపడతామని ఆయన స్పష్టం చేశారు. అమెరికా వద్ద ఉన్న అణ్వస్త్రాల శక్తిని ప్రస్తావిస్తూ ట్రంప్‌ మరింత స్పష్టత ఇచ్చారు.'రష్యా, చైనా వద్ద పెద్ద మొత్తంలో అణ్వాయుధాలు ఉన్నాయని అంటారు. కానీ మావద్ద వాటికంటే ఎక్కువ ఉన్నాయి. మా వద్ద ఉన్న అణ్వాయుధాలతో ఈ భూమిని 150 సార్లు పేల్చేయగలం. అణ్వస్త్రాల నిరాయుధీకరణ అంశంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌లతో నేను చర్చించానని తెలిపారు. అమెరికా అణ్వాయుధ పరీక్షలకు కావాల్సిన ఏర్పాట్లు ప్రారంభమయ్యాయని ట్రంప్‌ వెల్లడించారు. అయితే, ఆపరీక్షలు ఎప్పుడు, ఎక్కడ నిర్వహించనున్నారన్న దానిపై మాత్రం ఆయన ఎలాంటి వివరాలు వెల్లడించక పోవడం గమనార్హం.

 దక్షిణ కొరియాలోని బుసాన్‌లో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో జరగనున్న సమావేశానికి ముందు, ట్రంప్‌ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ 'ట్రూత్‌ సోషల్‌'లో చేసిన పోస్ట్‌లో ఈ అంశాన్ని ప్రస్తావించారు.''గతంలో నేను అధికారంలో ఉన్నప్పుడు అణు పరీక్షలు నిలిపివేశాం. ఆ నిర్ణయం అణ్వాయుధాల విధ్వంసకర శక్తిని దృష్టిలో ఉంచుకున్నదే. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారాయి.రష్యా, చైనా సహా పలు దేశాలు తమ అణు సామర్థ్యాలను వేగంగా పెంచుకుంటున్నాయి. వచ్చే ఐదేళ్లలో అమెరికా, రష్యా, చైనా సమాన స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. అందుకే అమెరికా తిరిగి అణు పరీక్షలు ప్రారంభించాల్సిన సమయం వచ్చిందని ట్రంప్‌ స్పష్టం చేశారు.

Also Read :  తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న చలి.. అత్యల్ప ఉష్ణోగ్రతలు ఈ జిల్లాల్లోనే..!

Also Read :  మందుబాబులకు బిగ్ షాక్..  4 రోజులు వైన్ షాపులు బంద్

Advertisment
తాజా కథనాలు