Nurse : నర్స్ ఘోరం: పని భారం తగ్గించుకోవడానికి 10 మంది రోగులను చంపేశాడు!

కేవలం తన పని భారం తగ్గించుకోవడం కోసం ఒక నర్సు ఏకంగా 10 మంది రోగులను చంపేసిన సంచలన ఘటన పశ్చిమ జర్మనీలో వెలుగు చూసింది.  ఈ ఘటన పవిత్రమైన వైద్య వృత్తికే కళంకం తెచ్చింది.

New Update
nurse

కేవలం తన పని భారం తగ్గించుకోవడం కోసం ఒక నర్సు ఏకంగా 10 మంది రోగులను చంపేసిన సంచలన ఘటన పశ్చిమ జర్మనీలో వెలుగు చూసింది.  ఈ ఘటన పవిత్రమైన వైద్య వృత్తికే కళంకం తెచ్చింది. ఈ కేసులో న్యాయస్థానం నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. నిందితుడైన పురుష నర్సు (44) 2023 డిసెంబర్ నుండి 2024 మే నెల మధ్యలో ఈ హత్యలకు పాల్పడ్డాడు. నైట్  షిఫ్టులో వృద్ధులు, తీవ్ర అనారోగ్యంతో ఉన్న రోగుల బాగోగులు చూడటం కష్టంగా అనిపించింది. దీనితో పనిభారాన్ని తగ్గించుకోవాలనే దురుద్దేశంతో ఈ దారుణానికి ఒడిగట్టాడు. 

మరో 27 మందిని హత్య చేయడానికి

నిందితుడు ఎక్కువగా పాలియేటివ్ కేర్ వార్డులో ఉన్న రోగులకు మార్ఫిన్, ఇతర శక్తివంతమైన మత్తుమందులు అధిక మోతాదులో ఇచ్చి చంపేశాడని ప్రాసిక్యూటర్లు కోర్టుకు తెలిపారు. ఇతను 10 మందిని హత్య చేయడంతో పాటు, మరో 27 మందిని హత్య చేయడానికి ప్రయత్నించినట్లుగా కూడా కోర్టు నిర్ధారించింది. ఆచెన్ కోర్టు ఈ నేరాన్ని  అత్యంత తీవ్రమైనదిగా పేర్కొంది. దీనివల్ల నిందితుడికి జర్మన్ చట్టాల ప్రకారం కనీస శిక్షా కాలం (15 సంవత్సరాలు) పూర్తయిన తర్వాత కూడా విడుదలయ్యే అవకాశం దాదాపు లేదని కోర్టు స్పష్టం చేసింది.  ఈ కేసు, 1999 నుంచి 2005 మధ్య 85 మంది రోగులను హతమార్చిన మాజీ నర్సు నీల్స్ హోగెల్ కేసును గుర్తుచేస్తోంది. ఆధునిక జర్మనీ చరిత్రలో హోగెల్ అత్యంత ఘోరమైన సీరియల్ కిల్లర్లలో ఒకడు.
 

Advertisment
తాజా కథనాలు