USA: సిరియాలో ఉగ్రస్థావరాలపై అమెరికా దాడులు

సిరియాలో ఐఎస్‌ఐఎస్‌ ఉగ్రవాద ముఠాలను అంతం చేయడమే టార్గెట్‌గా అమెరికా సైన్యం శనివారం భారీ దాడులు చేపట్టింది. అమెరికా తూర్పు తీర కాలమాన ప్రకారం మధ్యాహ్నం ఈ దాడులు చేసింది.

New Update
USA

USA

US Launches ‘Large-Scale’ Attacks Against ISIL In Syria

సిరియాలో ఐఎస్‌ఐఎస్‌ ఉగ్రవాద ముఠాలను అంతం చేయడమే టార్గెట్‌గా అమెరికా సైన్యం శనివారం భారీ దాడులు చేపట్టింది. అమెరికా(usa) తూర్పు తీర కాలమాన ప్రకారం మధ్యాహ్నం ఈ దాడులు చేసింది. సిరియావ్యాప్తంగా ఐసిస్‌ నెట్‌వర్క్‌లను మట్టుబెట్టాలనే ఉద్దేశంతో ఈ ఆపరేషన్ చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. ఈ దాడుల్లో ఎంతమంది చనిపోయారనే దానిపై ఇంకా క్లారిటీ లేదు.గతేడాది డిసెంబర్‌ 13న సిరియాలో ఐసిస్ ఉగ్రవాదులు కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో ఇద్దరు అమెరికా సైనికులతో పాటు ఓ అనువాదకుడు మృతి చెందారు.   

Also Read :  ఇరాన్‌లో ఉద్రిక్తతలు.. 72కు చేరుకున్న మృతుల సంఖ్య

ఈ ఉగ్రదాడిని అమెరికా తీవ్రంగా ఖండించింది. తమ సైనిక చర్యలో భాగంగానే ఈ దాడులు చేసినట్లు అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ తెలిపింది. ప్రస్తుతం చూసుకుంటే సిరియాలో 1000 మంది అమెరికా సైనికులు ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటున్నట్లు సమాచారం. గత కొన్ని నెలలుగా చూసుకుంటే అమెరికా నేతృత్వంలోని దళాలు సిరియాలో ISIS అనుమానితులపై గగనతల, భూతల దాడులు చేస్తున్నాయి.  

Also Read :  ఇండియా నేవీ మాస్టర్ ప్లాన్.. చైనా, బంగ్లాదేశ్‌ ఆటలకు చెక్!

Advertisment
తాజా కథనాలు