/rtv/media/media_files/2026/01/11/iran-protests-2026-01-11-07-41-17.jpg)
Iran Protests
కొన్నిరోజుల క్రితం ఇరాన్‌లో మొదలైన అల్లర్లు హింసాత్మక ఘటన(iran protest) లకు దారితీశాయి. రాజధాని టెహ్రాన్‌తో పాటు వివిధ ప్రాంతాల్లో ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చి నిరసనలు చేస్తున్నారు. ఈ ఘటనల్లో మృతి చెందిన వారి సంఖ్య 72కు చేరింది. వీళ్లలో పిల్లలు, భద్రతా సిబ్బంది కూడా ఉన్నారు. మరోవైపు 2300 మందికి పైగా ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం రాత్రి వివిధ చోట్ల వాహనాదారులకు నిరసనాకారులకు నిప్పు పెట్టారు.
Also Read: దారుణం.. 19ఏళ్ల యువతిపై పోలీస్ డ్రైవరే సామూహిక అత్యాచారం
Iran Protest
రాజధాని టెహ్రాన్(tehran attack) లో ఆఫీసులు, వాహనాలు మంటల్లో కాలిపోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంటర్నెట్, ఫోన్ సేవలను నిలిపివేయడంతో బయటి ప్రపంచంతో ఇరాన్‌కు సంబంధాలు తెగిపోయాయి. అయితే కొందరు స్టార్‌లింక్ ఇంటర్నెట్ సేవలను కూడా వినియోగిస్తున్నారు. ప్రస్తుతం ఇరాన్‌లో పరిస్థితి కంట్రోల్‌లోనే ఉందని ఇరాన్ అధికార టీవీ ఛానల్‌లో వార్తలు వస్తున్నాయి. మరోవైపు అక్కడ శనివారం నుంచి స్కూల్స్, కాలేజీలు ఆన్‌లైన్ తరగతులకే పరిమితమయ్యాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనల్లో పాల్గొనే వాళ్లని దైవ వ్యతిరేకులుగా భావిస్తామని ఇరాన్ అటార్నీ జనరల్ మహమ్మద్ మోవహెదీ ఆజాద్ వార్నింగ్ ఇచ్చారు. వాళ్లకి మరణశిక్ష విధిస్తామంటూ హెచ్చరించారు.
ఇరాన్‌లో జరుగుతున్న ఆందోళనలకు అమెరికా సపోర్ట్ చేస్తోంది. అధ్యక్షుడు ట్రంప్‌తో ఆటలాడొద్దని అమెరికా విదేశాంగ శాఖ హెచ్చరించింది. ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీ మాత్రం ఈ హెచ్చరికలను పట్టించుకోవడం లేదు. నిరసనాకారులను అణిచివేసేందుకు కఠినంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇరాన్‌లో ఆర్థిక సంక్షోభం పెరగడం, కరెన్సీ విలువ పడిపోవడంతో అక్కడి ప్రజలు గత రెండువారాలుగా ఆందోళనలు చేస్తున్నారు. దీంతో ఇరాన్‌లోని పలు నగరాలకు విమాన సర్వీసులు కూడా రద్దయ్యాయి.
Also Read: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు భారీ షాక్.. 63 మంది నక్సలైట్లు లొంగుబాటు
మరోవైపు ట్రంప్ కూడా ఇరాన్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.నిరసనాకారులపై కాల్పులు జరిపితే తాము జోక్యం చేసుకుంటామని హెచ్చరించారు. శుక్రవారం వైట్‌హౌస్‌లో అగ్రశ్రేణి చమురు, గ్యాస్‌రంగాల ప్రతినిధులతో జరిగిన సమావేశం తర్వాత ట్రంప్ మీడియాతో మాట్లాడారు. ఇరాన్‌లో జరుగుతున్న ఆందోళనలకు తాము జాగ్రత్తగా పరిశీలిస్తున్నామని అన్నారు. గతంలో జరిగినట్లే ప్రజలను చంపడం మొదలుపెడితే మేము జోక్యం చేసుకుంటామని హెచ్చరించారు.
Follow Us