India-US Trade War: అధ్యక్షుడు ఒకలా..వాణిజ్య మంత్రి మరొకలా..రష్యా చమురు కొనుగోలు ఆపితేనే చర్చలని ప్రకటన

ఒకవైపు భారత ప్రధాని మోదీ తనకు మంచి స్నేహితుడని..భారత్ తో చర్చలకు సిద్ధమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటిస్తారు. మరోవైపు రష్యా నుంచి చమురు కొనుగోలు ఆపితేనే చర్యలు కొనసాగిస్తామని ఆ దేశ వాణిజ్య మంత్రి హోవర్డ్ లూట్నక్ ప్రకటించడం సందేహాలుకు దారి తీస్తోంది.

author-image
By Manogna alamuru
New Update
lutnick

అసలేం జరుగుతోంది..అమెరికా మనతో ఆడుకుంటోందా..ఇప్పుడు భారతీయుల్లో కలుగుతున్న సందేహం ఇది. అధ్యక్షుడు, నేతల మాటల్లో తేడానే దీనికి కారణం. భారత్, అమెరికా వాణిజ్య సంబంధాలు ఈ మధ్య కాలంలో దెబ్బ తిన్నాయి. అధ్యక్షుడు ట్రంప్ అదనపు సుంకాలతో భారత్ పై అధిక భారం మోపారు. అయితే రీసెంట్ గా ఆయన కాస్త తగ్గినట్టు కనిపించారు. భారత్ తో వాణిజ్య సంబంధాలు వదులుకోవడానికి సిద్ధంగా లేమన్నట్టు సూచించారు. భారత ప్రధాని మోదీ తనకు మంచి స్నేహితుడని స్వయంగా మాట్లడతానని చెప్పారు. ఈ నేపథ్యంలో అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్లూట్నిక్ మాటలు భారత్ ను మళ్ళీ సందేహంలో పడేస్తున్నాయి.

నేతల విరుద్ధ స్వరాలు..

తాజాగా హోవార్డ్ ఒక ఇంటర్య్యూలో భారత్ తో చర్చలపై మాట్లాడారు. ఇంతకు ముందు తీవ్ర హెచ్చరికలు చేసిన ఆయన ఇప్పుడు ఆచితూచి స్పందించారు. కానీ చివరకు మాత్రం భారత్...రస్యా నుంచి చమురు కొనుగోలును ఆపేస్తేనే వాణిజ్య చర్చల్లో ముందుకు వెళ్తామనిసంకేతాలిచ్చారు. అమెరికా ఏ వాణిజ్య సమస్యలపై ఎక్కువ దృష్టి పెట్టిందని అడిగిన ప్రశ్నకు సమాధానంగా హోవార్డ్ ఇది చెప్పారు. అయితే అంతకు ముందు భారత్‌ త్వరలోనే క్షమాపణలు చెబుతుందిఅంటూహోవార్డ్ తీవ్రంగా మాట్లాడిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సారి ఆ తీవ్రత లేకపోయినప్పటికీ...తమ ఆలోచన మాత్రం మారలేదని స్పష్టం చేశారు.

ఆశాజనకం అంటున్న భారత వాణిజ్య మంత్రి..

మరోవైపు వాణిజ్య, పరిశ్రమల మంత్రిపియూష్ గోయల్భారత్, అమెరికాల మధ్య  వాణిజ్య చర్చలు ఆశాజనకంగా ఉన్నాయని చెబుతున్నారు. ఫిబ్రవరిలోనేఅమెరికా అధ్యక్షుడుట్రంప్, మన ప్రధానిమోదీనవంబర్ నాటికి వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవాలని చెప్పారు. అందులో భాగంగా ఇప్పటికే ఆరు విడతలుగా చర్చలు చేశాము. అయితే మధ్యలో టారిఫ్ ల వలన వాటికి బ్రేక్ వచ్చాయి. కానీ ఇప్పుడు మళ్ళీ రెండు దేశాలు చర్చలకు రెడీ అయ్యాయి. ఈ నేపథ్యంలో నవంబర్ లో కల్లా చర్చలు ఓ కొలిక్కి వచ్చి ఒప్పందాలు కుదుర్చుకుంటామని వాణిజ్య మంత్రిపియూష్గోయల్తెలిపారు. చర్చలు చాలా తీవ్రంగాజరుగుతున్నాయని..పురోగతిసాధిస్తున్నామని చెప్పారు.

Also Read: Nepal: నేపాల్ రాజకీయాల్లో తొలగని అనిశ్చితి..ఎటూ తేల్చుకోలేకపోతున్న జెన్ జీ

Advertisment
తాజా కథనాలు