/rtv/media/media_files/2026/03/03/us-embassy-in-riyadh-hit-in-drone-attack-2026-03-03-07-15-38.jpg)
US embassy in Riyadh hit in drone attack
పశ్చిమాసియా(west-asia) లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో ఉన్న అమెరికన్ ఎంబసీపై డ్రోన్ దాడి(drone-attack) జరిగింది. ఒక్కసారిగా పెద్ద శబ్ధం రావడంతో అక్కడున్న స్థానికులు భయంతో పరుగులు తీశారు. ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. దీనికి సంబంధించి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇరానే ఈ దాడులకు పాల్పడ్డట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై సౌదీ అరేబియా రక్షణ శాఖ కూడా స్పందించింది. రెండు డ్రోన్లతో దాడులు జరిగినట్లు వెల్లడించింది. అక్కడ మంటలు చెలరేగడంతో కొద్దిపాటి నష్టం జరిగినట్లు పేర్కొంది.
Also Read : గల్ఫ్ దేశాల్లో యుద్ధ మేఘాలు.. భారతీయుల కోసం రంగంలోకి ప్రధాని మోదీ
US Embassy In Riyadh Hit In Drone Attack
🚨🇺🇸🇸🇦 BREAKING: Senior US official reportedly confirms the American Embassy in Riyadh was hit in an attack, likely by a drone.
— Mario Nawfal (@MarioNawfal) March 3, 2026
Source: @officialrnintel Axios https://t.co/cRS3ATdXsopic.twitter.com/BD4TD0QNKa
ఇదిలాఉండగా ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో ఆ దేశ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ(ayatollah-ali-khamenei) మృతి చెందిన సంగతి తెలిసిందే. దీంతో ఇరాన్ కూడా గల్ఫ్ దేశాల్లోని అమెరికా ఎంబసీలు, వైమానిక స్థావరాలపై దాడులు చేస్తున్నాయి. దీంతో పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం కొనసాగుతోంది. అయితే ఈ దాడులు ప్రాంతీయ ఘర్షణకు దారితీసే ప్రమాదముందని రష్యా అధ్యక్షుడు పుతిన్ హెచ్చరించారు. ఉద్రిక్త పరిస్థితులను దౌత్య మార్గాల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు.
Also Read: గల్ఫ్ దేశాల్లో యుద్ధ మేఘాలు.. భారతీయుల కోసం రంగంలోకి ప్రధాని మోదీ
సౌదీ అరేబియా, UAE, ఖతర్, బహ్రెయిన్ రాజులతో పుతిన్ సోమవారం ఫోన్‌లో మాట్లాడారు. పశ్చిమాసియాలో జరుగుతున్న ఉద్రిక్త పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఈ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు, మరో 40 మందికి పైగా సీనియర్ నేతలు చనిపోయారు. మరోవైపు ఇరాన్‌పై మరిన్ని దాడులు చేస్తామని ట్రంప్ హెచ్చరిస్తున్నారు.
Follow Us