/rtv/media/media_files/2026/03/02/pm-modi-2026-03-02-20-46-06.jpg)
గల్ఫ్ దేశాల్లో ఉన్న లక్షలాది మంది భారతీయుల భద్రతపై భారత ప్రభుత్వం అత్యంత అప్రమత్తమైంది. అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం ఇప్పుడు గల్ఫ్ దేశాలకు పాకింది. ముఖ్యంగా అమెరికా సైనిక స్థావరాలకు చోటు కల్పించిన ఎనిమిది అరబ్ దేశాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులు ఉధృతం చేయడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
నేరుగా అమెరికాను ఢీకొనడం కంటే, అమెరికాకు మద్దతుగా ఉన్న గల్ఫ్ దేశాలపై ఒత్తిడి పెంచడంతో యుద్ధాన్ని ఆపవచ్చని ఇరాన్ భావిస్తోంది. ఈ దేశాలన్నీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌పై ఒత్తిడి తెచ్చి, యుద్ధం నుంచి తప్పుకునేలా చేయాలనేది ఇరాన్ ప్రధాన ఎత్తుగడ. దీనివల్ల గల్ఫ్ ప్రాంతంలో నివసిస్తున్న విదేశీయులు, ముఖ్యంగా భారతీయులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో గల్ఫ్ దేశాల్లో ఉన్న భారతీయుల రక్షణ కోసం ప్రధాని నరేంద్ర మోదీ రంగంలోకి దిగారు. ప్రధాని మోదీ వివిధ గల్ఫ్ దేశాధినేతలతో ఫోన్ ద్వారా సంప్రదింపులు జరుపుతున్నారు. భారతీయుల భద్రతకు ఎటువంటి ఢోకా లేకుండా చూడాలని కోరుతున్నారు.
యుద్ధం మరింత తీవ్రమైతే, అక్కడ చిక్కుకుపోయిన భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తీసుకురావడానికి అవసరమైన ఏర్పాట్లపై అధికారులతో చర్చిస్తున్నారు. ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లిన లక్షలాది మంది ప్రాణాలకు ముప్పు పొంచి ఉండటంతో, భారత విదేశాంగ శాఖ నిరంతరం అక్కడి రాయబార కార్యాలయాలతో సంప్రదింపులు జరుపుతోంది. ప్రస్తుతం గల్ఫ్ దేశాల్లో నెలకొన్న అస్థిరత భారత్‌కు అటు ఆర్థికంగా, ఇటు మానవీయంగా పెద్ద సవాలుగా మారింది. పరిస్థితిని బట్టి ప్రభుత్వం తదుపరి నిర్ణయాలు తీసుకోనుంది.
Follow Us