ఇరాన్ కు అమెరికా యుద్ధ విమానాలు | US Warns Iran| West Asia | IranvsIsrael America Supports Israel
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య వార్ మరింత భీకరంగా మారుతోంది. ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ వ్యవస్థ దెబ్బతినట్లు తెలుస్తోంది. శాటిలైట్ పంపిన ఫొటోల్లో ఈ విషయం స్పష్టంగా తెలుస్తోందంటూ పలు నివేదికలు వెల్లడించాయి. ఈ వార్తలను ఇరాన్ ఖండిస్తోంది.
ఇరాన్ తో యుద్ధానికి కాలు దువ్వుతున్న ఇజ్రాయెల్ మరోసారి గాజాపై ప్రతీకారం తీర్చుకుంది. రఫాలో శరణార్థి శిబిరాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులకు పాల్పడింది. 22మంది మృతి చెందినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. మృతుల్లో 18మంది చిన్నారులున్నట్లు ఆందోళన వ్యక్తం చేశారు.