USA: వేదం సుబ్రహ్మణ్యానికి ఊరట.. డిపోర్ట్ చేయొద్దన్న కోర్టులు..

చేయని నేరానికి నలభై ఏళ్ళు అమెరికా జైల్లో మగ్గిన భారత సంతతి వ్యక్తి వేదం సుబ్రహ్మణ్యానికి ఎట్టకేలకు ఊరట లభించింది. ఇటీవలే నిర్దోషిగా విడుదలైన ఆయనను దేశం నుంచి డిపోర్ట్ చేయొద్దని రెండు కోర్టులు ఇమ్మిగ్రేషన్ అధికారులను ఆదేశించాయి.

New Update
vedam

Vedam Subrhamanyam

భారత్ కు చెందిన వేదం సుబ్రహ్మణ్యానికి ఆయనకు తొమ్మిది నెలల వయసులో ఆయన కుటుంబం 1962లో అమెరికాకు వెళ్ళారు. పెన్సిల్వేనియాలోని స్టేట్‌ కాలేజీలో స్థిరపడిన వీరికి.. అమెరికా పౌరసత్వం కూడా వచ్చింది. కానీ 1980లో సుబ్రహ్మణ్యం తన స్నేహితుడి హత్య కేసులో అరెస్ట్ అయ్యారు. సరైన సాక్ష్యాధారాలు లేకుండానే ఆయనపై అభియోగాలు మోపడంతో అప్పట్లో కోర్టు దోషిగా తేల్చి జీవితఖైదు విధించింది. దీనిపై ఆయన అప్పటి నుంచీ న్యాయపోరాటం చేస్తూనే ఉన్నారు. నలభై ఏళ్ళ తర్వాత రీసెంట్ గా వేదం సుబ్రహ్మణ్యాన్ని నిర్దోషిగా విడుదలయ్యారు. ప్రస్తుతం 64 ఏళ్ల వేదం ప్రస్తుతం లూసియానాలోని ఓ నిర్బంధ కేంద్రంలో ఉన్నారు. ఆయనను భారత్ కు తిరిగి పంపించాలని ఇమ్మిగ్రేషన్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ దీనిపై రెండు న్యాయస్థానాల జడ్జిలు స్టే విధించారు. ఆయన కేసును రివ్యూ చేయాలా వద్దా అన్న దానిపై బ్యూరో ఆఫ్‌ ఇమిగ్రేషన్‌ అప్పీల్స్‌ నిర్ణయం తీసుకునేవరకు దేశం నుంచి బహిష్కరించొద్దనిజడ్జిలు ఆదేశించారు. పెన్సిల్వేనియాలోని యూఎస్‌ డిస్ట్రిక్ట్‌ కోర్ట్‌ కూడా ఇదే విధమైన స్టే విధించింది.

మాదక ద్రవ్యాల కేసులో..

హత్య కేసులో నుంచి సుబ్రహ్మణ్యం బయటపడినా...అంతకు ముందు మాదక ద్రవ్యాల సరఫరా కేసు నమోదు అయింది. ఈ కేసులో వేదం దోషిగా తేలింది. దీంతో ఆయనపై చట్టపరంగా దేశ బహిష్కరణ ముప్పు ఎదురైంది. దీంతో ఇటీవల నిర్దోషిగా జైలు నుంచి విడుదలైన సుబ్రహ్మణ్యంను ఇమిగ్రేషన్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

Also Read: Stock Market: కుప్ప కూలిన షేర్ మార్కెట్.. 25 వేల కంటే దిగువన నిఫ్టీ..

Advertisment
తాజా కథనాలు