USA: వారం రోజుల్లో తేలనున్న ట్రంప్ భవితవ్యం? 33 రోజులుగా షట్ డౌన్ లో అమెరికా..

ఈ వారం అంతా ట్రంప్ గవర్నమెంట్ అగ్ని పరీక్షలను ఎదుర్కోబోతోంది. ప్రభుత్వ షట్ డౌన్ ఒకవైపు, నాలుగు పెద్ద రాష్ట్రాల ఎన్నికలు మరోవైపు, సుంకాలపై కేసు విచారణ, మాదక ద్రవ్యాల పడవలపై దాడులను వైట్ హౌస్ పరిశీలనతో గడ్డు పరిస్థితిని ఎదుర్కోనున్నారు.

New Update
trump

అమెరికా కాంగ్రెస్ నిధులు విడుదల చేయకపోవడంతో అక్కడి గవర్నమెంట్ మూతబడింది. ఇది జరిగి ఇప్పటికి 33 రోజులు అయింది. దగ్గరలో మళ్ళీ మొదలయ్యే ఛాన్సెస్ కూడా కనిపించడం లేదు. అమెరికా అధ్యక్షుడు ఎక్కడా తగ్గేట్టు కనిపించడం లేదు. రిపబ్లికన్లు, డెమోక్రాట్లకు మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు. దీని కారణం చాలా ప్రభుత్వ సంస్థలు మూతబడ్డాయి. వేల మంది ఫెడరల్ ఉద్యోగులకు జీతాలు అందడం లేదు. 4.2 కోట్లమంది పేద అమెరికన్లకు ఫెడరల్‌ ప్రభుత్వం నుంచి ఆహార సహాయం బంద్‌ అయిపోయే సంకేతాలు కనిపిస్తున్నాయి. పాక్షిక ఆహార సహాయ చెల్లింపులను కవర్ చేయడానికి అత్యవసర నిధులను విడుదల చేయాలని చాలా మంది ఫెడరల్ జడ్జిలు ప్రభుత్వాన్ని ఆదేశించారు. మరోవైపు పరిస్థితిని సులభతరం చేసే అత్యవసర నిధులను వైట్ హౌస్ నిలిపివేసిందనిడెమోక్రాట్లు ఆరోపిస్తున్నారు. అయినా కూడా ట్రంప్ గవర్నమెంట్ ఇవేమీ పట్టించుకోవడం లేదు.

రాజీ పడేేదే లేదు..

మాజీ అధ్యక్షుడు బరాక్ఒబామా తీసుకువచ్చిన అందుబాటు ధరల్లో ఆరోగ్య సంరక్షణ చట్టం పునరుద్ధరించాలనే డిమాండ్ తో డెమోక్రాట్లు ఫెడరల్‌ సర్వీసులకు నిధుల విడుదలను ఆపేశారు. వీరితో బేరమాడే ప్రసక్తి లేదని...రాజీ పడనని ట్రంప్ అంటున్నారు. పైగా చివరకు డెమోక్రాట్లే తమతో కాళ్లబేరానికి వస్తారని అన్నారు. 100 సీట్ల సెనెట్‌లో నిధుల విడుదల చట్టం 60 ఓట్లతో ఆమోదం పొందాల్సి ఉంది. అక్కడ రిపబ్లికన్లకు 53 మంది సభ్యులు, డెమోక్రాట్లకు 45 మంది ఉన్నారు. ఇద్దరు ఇండిపెండెంట్లు నిధుల చట్టానికి అనుకూలంగా ఓటు వేసినా కనీసం అయిదుగురు డెమోక్రటిక్‌ పార్టీ సభ్యులు కూడా ఇదే చేస్తే నిధులు విడుదల అవుతాయి. అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అసలు ఈ మొత్తం రూల్ నే తీసిపారేయాలని సెనెట్‌లో రిపబ్లికన్‌ పార్టీ నాయకుడిని కోరారు. ఇది ఏమవుతుందో..ఈ పరిస్థితి ఎన్నాళ్ళుకొనసాగుతుందో మాత్రం స్పష్టత రావడం లేదు.

నాలుగు ముఖ్య రాష్ట్రాల్లో ఎన్నికలు..

మరోవైపు అమెరికాలో మంగళవారం వర్జీనియా, న్యూజెర్సీ, న్యూయార్క్ మరియు కాలిఫోర్నియాలలో ఎన్నికలు జరగనున్నాయి. యూఎస్ లో మేజర్ రాష్ట్రాలు ఈ నాలుగు. ఇక్కడ ఎన్నికయ్యే నాయకులు అమెరికా రాజకీయాలను శాసించే అవకాశం ఉంది. వర్జీనియా, న్యూ యార్క్లలోడెమోక్రాట్ పార్టీకి చెందిన నేతలు ఎన్నికయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అన్నిటి కంటే ముఖ్యంగా న్యూ యార్క్ లో భారత సంతతికి చెందిన జోహ్రాన్మామ్దానీట్రంప్ ను బాగా భయపెడుతున్నారు. నాలుగు చోట్లా డెమోక్రాట్లేగెలిస్తే..రిపబ్లికన్లకు గడ్డు కాలం తప్పదనే చెప్పాలి.

సుంకాలపై విచారణ..

ఇంకోవైపు ఇదే వారంలో ట్రంప్ "లిబరేషన్ డే" సుంకాలపై సుప్రీంకోర్టు ఒక ప్రధాన కేసును విచారించడానికి సిద్ధమవుతోంది. ఇందులో కనుక ఆయనకు వ్యతిరేకంగా తీర్పు వస్తే..మొత్తం పరిస్థితి తారుమారు అవుతుంది. అలాగే కరేబియన్, పసిఫిక్‌లలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా పడవలపై వరుస సైనిక దాడులకు సంబంధించి వైట్ హౌస్ కూడా పరిశీలనను ఎదుర్కొంటోంది. ట్రంప్ తన రాజ్యాంగ అధికారాలను అధిగమించారా అనే ప్రశ్నలను చట్టసభ్యులు వేస్తున్నారు. ఇలా ఏ రకంగా చూసినా ఈ వారం రోజులూ అధ్యక్షుడు ట్రంప్, ఆయన గవర్నమెంట్ కు అగ్ని పరీక్సలుఎదువబోతున్నాయి. వీటిలో ఎన్నింటి నుంచి తప్పించుకుంటారు అనేది చూడాలి. దాని బట్టి అమెరికా భవితవ్యం తేలబోతోంది.

Also Read: New York: హాట్ హాట్ గా న్యూయార్క్ మేయర్ ఎన్నికలు..ట్రంప్ కు సెగ పెడుతున్న జోహ్రాన్ మామ్దానీ

Advertisment
తాజా కథనాలు