USA Ban Transgenders: అమెరికా సైన్యంలో ట్రాన్స్ జెండర్లపై నిషేధం

ట్రంప్ వచ్చాక అమెరికాలో ట్రాన్స్ జెండర్ల మీద నిషేధాలు మొదలయ్యాయి. ఇప్పటికే వారిని క్రీడల్లో నుంచి తొలగించారు. తాజాగా అమెరికా మిలటరీ నుంచి కూడా వారిని తప్పించారు. సైన్యంలో ట్రాన్స్ జెండర్ల నియామకాలను నిషేధించారు. 

New Update
usa

US Army Bans transgenders

USA Ban Transgenders: అమెరికా(America) అధ్యక్షుడికి ట్రాన్స్ జెండర్లు అంటే ఎందుకో ఇష్టం లేదు. ఎన్నికల దగ్గర నుంచి వారి మీద నిషేధం ఉంటుందని చెబుతూనే ఉన్నారు. తాను అధికారంలోకి రాగానే మొట్టమొదటగా క్రీడల్లో ట్రాన్స్ జెండర్లు ఉండకుండా చట్టాన్ని తీసుకువస్తానని చెప్పారు అన్నట్టుగానే ఆ ఫైల్ మీద మొదటి రోజునే సంతకం చేశారు. దీంతో అమెరికా క్రీడల్లో ట్రాన్స్ జెండర్లను నిషేధించారు. ఇప్పుడు తాజాగా అమెరికా మిలటరీ(US Military)లో కూడా ట్రాన్స్ జెండర్ల నియామకాలను నిషేధించినట్టు సైన్యం ప్రకటించింది. 

Also Read:  Tariffs: ట్రంప్ టారీఫ్ లతో భారత్ కు నష్టమా...లాభమా?

Also Read: ఆ విషయంలో భర్త బలవంతం చేసినా తప్పుకాదు: హైకోర్టు

ఏ రకంగానూ ఉండడానికి వీలులేదు..

ఈ నిషేధానికి సంబంధించి అమెరికా మిలటరీ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది. ట్రాన్స్‌జెండర్‌లు సైన్యంలో చేరడాన్ని అమెరికా మిలిటరీ విభాగం నిషేధించింది. అలాగే సర్వీసులో ఉండగా లింగమార్పిడి కూడా అనుమతించమని తేల్చి చెప్పింది. ఈ రేలు వెంటనే  అమల్లోకి వస్తుందని తెలిపింది.  అమెరికాకు సేవ చేయాలనుకునే జెండర్ డిస్ఫోరియా వ్యక్తులను మేం గౌరవిస్తాం కానీ తమను తాము ట్రాన్స్‌జెండర్‌గా భావించే వారి నియామకాలను మాత్రం  ఆపేస్తున్నామని చెప్పింది. ఇప్పటికే సర్వీసులో ఉన్నవారు లింగమార్పిడి చేయించుకోవడానికి సంబంధించిన వైద్య ప్రక్రియలను నిలిపివేస్తున్నామని పోస్ట్ లో రాసుకొచ్చారు. ట్రంప్ మొదటి సారి అధ్యక్షుడుగా ఉన్నప్పుడు కూడా మిలటరీలో ట్రాన్స్ జెండర్లు చేరకుండా ఉత్తర్వులు జారీ చేశారు. అయితే అప్పటికే మిలటరీ ఉన్నవారిని మాత్రం కంటిన్యూ చేశారు. కానీ ఇప్పుడు వారి మీద కూడా ఆంక్షలు పెడుతున్నారు. ఉన్నవారు కూడా మానేసి వెళ్ళిపోయేలా రూల్స్ తీసుకువచ్చారు. 

Also Read: USA: ఎలాన్ మస్క్ నా బిడ్డకు తండ్రి..రచయిత్రి, ఇన్ఫ్లూయెన్సర్

Also Read :  USA: ఎలాన్ మస్క్ నా బిడ్డకు తండ్రి..రచయిత్రి, ఇన్ఫ్లూయెన్సర్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు