/rtv/media/media_files/2026/03/09/freedom-shield-2026-03-09-11-08-29.jpg)
పశ్చిమాసియాలో ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా(america) మధ్య యుద్ధం తీవ్రరూపం దాల్చింది. ట్రంప్ పెట్టిన చిచ్చు గల్ఫ్ దేశాల్లో రక్తం ఏరులై మారుతుంది. ఈక్రమంలో అమెరికా మరో దేశాలను ఖయ్యానికి ఉసిగొలుపుతూ రెచ్చగొడుతుంది. అమెరికా, దక్షిణ కొరియా సంయుక్తంగా తమ వార్షిక సైనిక విన్యాసాలు 'ఫ్రీడమ్ షీల్డ్ 2026'(Freedom Shield 2026) ను సోమవారం (మార్చి 9) ప్రారంభించాయి. పశ్చిమాసియాలో అమెరికా యుద్ధంలో ఉన్నప్పటికీ, కొరియా ద్వీపకల్పంపై కూడా తనకు పట్టు ఉందని నిరూపించేందుకు అగ్రరాజ్యం ఈ విన్యాసాలు నిర్వహిస్తోంది. ఈ విన్యాసాల్లో దాదాపు 18,000 మంది దక్షిణ కొరియా సైనికులు(US-South Korea Joint Military Exercise) పాల్గొంటున్నారు. అమెరికా తన దళాల సంఖ్యను అధికారికంగా ప్రకటించనప్పటికీ, వేల సంఖ్యలో యూఎస్ సైనికులు ఇందులో భాగస్వాములవుతున్నారు. మార్చి 9న ప్రారంభమైన ఈ విన్యాసాలు మార్చి 19 వరకు అంటే మొత్తం 11 రోజుల పాటు కొనసాగుతాయి.
సాధారణంగానే ఇలాంటి విన్యాసాలను ఉత్తర కొరియా(north-korea) తనపై 'దురాక్రమణకు రిహార్సల్'గా భావిస్తుంది. ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్(kim jong un) ఇటీవల జరిగిన రాజకీయ సమావేశంలో అమెరికా, దక్షిణ కొరియాలను తమ ప్రధాన శత్రువులుగా ప్రకటించారు. ఈ విన్యాసాలకు నిరసనగా ఉత్తర కొరియా మళ్ళీ క్షిపణి పరీక్షలు నిర్వహించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కంప్యూటర్ సిమ్యులేటెడ్ శిక్షణతో పాటు, క్షేత్రస్థాయిలో దాదాపు 22 రకాల ఫీల్డ్ ట్రైనింగ్ నిర్వహించనున్నారు. ఉత్తర కొరియా నుంచి ఎదురయ్యే అణు ముప్పులను అడ్డుకోవడం, జాయింట్ డిఫెన్స్ సిస్టమ్ బలోపేతం చేయడం ఈ విన్యాసాల ప్రధాన లక్ష్యం.
Also Read : కుప్పకూలిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ఒక్కరోజే 10 లక్షల కోట్లు నష్టం
పశ్చిమాసియా ప్రభావం
అమెరికా తన రక్షణ వ్యవస్థలోని కొన్ని కీలక ఆస్తులను దక్షిణ కొరియా(south-korea) నుండి పశ్చిమాసియాకు తరలిస్తోందనే వార్తలు ఇటీవల వెలువడ్డాయి. అయితే, దీనివల్ల దక్షిణ కొరియా రక్షణకు ఎలాంటి ముప్పు ఉండదని, తాజా విన్యాసాలు తమ సంసిద్ధతను చాటుతాయని ఇరు దేశాల రక్షణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. ప్రపంచం ఒకవైపు చమురు సంక్షోభం, పశ్చిమాసియా యుద్ధంతో సతమతమవుతుంటే, అమెరికా-దక్షిణ కొరియా విన్యాసాలు ఆసియా ప్రాంతంలో మరింత ఉత్కంఠను రేపుతున్నాయి. ఒకవేళ ఇక్కడ పరిస్థితి విషమిస్తే, ప్రపంచం మరో మరో యుద్ధ సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Also Read : పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు బిగ్ షాక్.. 47 మంది పార్టీ లీడర్లకు జైలు శిక్ష
Follow Us